SNP
Sourav Ganguly, Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా అద్భుత విజయాలు సాధిస్తోంది. జట్టులో కోహ్లీ, షమీ లాంటి స్టార్లు లేకపోయినా.. యంగ్ టీమిండియాను రోహిత్ సూపర్‌గా లీడ్ చేస్తున్నాడు. ఈ విషయంపై గంగూలీ స్పందిస్తూ.. ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Sourav Ganguly, Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా అద్భుత విజయాలు సాధిస్తోంది. జట్టులో కోహ్లీ, షమీ లాంటి స్టార్లు లేకపోయినా.. యంగ్ టీమిండియాను రోహిత్ సూపర్‌గా లీడ్ చేస్తున్నాడు. ఈ విషయంపై గంగూలీ స్పందిస్తూ.. ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్ విజయంతో ఫుల్ ఖుషీలో ఉన్నాడు. భారత జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జట్టు విజయపథంలో నడిపిస్తున్న రోహిత్.. మంచి కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఫైనల్ వరకు వెళ్లిందంటే.. ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు రోహిత్ అద్భుత కెప్టెన్సీ కూడా కారణమైంది. ఇప్పుడు తాజాగా.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ తిరిగి పుంజుకుని.. వరుసగా మూడు టెస్టులు గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. పైగా కోహ్లీ, షమీ, కేఎల్ రాహుల్, మధ్యలో బుమ్రా లాంటి స్టార్ క్రికెటర్లు లేకపోయినా.. రోహిత్ ఒక్కడే యువ క్రికెటర్లతో కలిసి పటిష్టమైన ఇంగ్లండ్‌ను ఓడించాడు. అయితే.. రోహిత్ కెప్టెన్సీపై తాజాగా టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మ టీమ్‌ను అద్భుతంగా లీడ్ చేస్తున్నాడని, అతనిలో ఈ టాలెంట్ ఉందని గ్రహించే, అతన్ని తానే కెప్టెన్ చేశానని గంగూలీ పేర్కొన్నాడు. సౌరవ్ గంగూలీ 2019 నుంచి 2022 వరకు బీసీసీఐ ఛైర్మన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. తన పిరియడ్‌లోనే విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించాడు. ఆ సమయంలో గంగూలీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతకంటే ముందు కోహ్లీ.. టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఆ బాధ్యతలను రోహిత్‌కు అప్పగించింది బీసీసీఐ. అయితే.. వైట్ బాల్ క్రికెట్‌కు ఒక్కడే కెప్టెన్ ఉండాలని భావించిన బీసీసీఐ బాస్ దాదా.. కోహ్లీని తప్పించి రోహిత్‌కే వన్డే కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించారు.
వన్డే కెప్టెన్సీ నుంచి తనను అకారణంగా తప్పించారనే కోపంతో కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి కూడా రాజీనామా చేశాడు. టెస్ట్ కెప్టెన్సీ కూడా రోహిత్‌కే అప్పగించాడు గంగూలీ. ఈ విషయంలో కోహ్లీ-గంగూలీ మధ్య విభేదాలు తలెత్తినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా.. కోహ్లీని తప్పించాడా లేదా అనే విషయం పక్కనపెడితే.. రోహిత్ టీమిండియా కెప్టెన్ అవ్వడం వెనుక మాత్రం కచ్చితంగా గంగూలీ పాత్ర ఉంది. ప్రస్తుతం టీమిండియాకు ఇంత మంచి కెప్టెన్‌ని అందించినందుకు గంగూలీ సైతం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. మరి రోహిత్‌ను కెప్టెన్‌ని చేసింది నేను అని గంగూలీ అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sourav Ganguly said, “I made Rohit Sharma the captain because I saw talent in him and I am not surprised by what he has done”. (RevSportz). pic.twitter.com/oklhIRopzB
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 29, 2024