iDreamPost
android-app
ios-app

వీడియో: మరోసారి హృదయాలు కొల్లగొట్టిన స్మృతి మంధాన! చిన్నారి ఫ్యాన్‌ కోసం..

  • Published Jul 21, 2024 | 12:04 PM Updated Updated Jul 21, 2024 | 12:04 PM

Smriti Mandhana, Sri Lanka, Asia Cup 2024: ఉమెన్స్‌ క్రికెట్‌లో చాలా మందికి మోస్ట్‌ ఫేవరేట్‌ క్రికెటర్‌ ఎవరంటే స్మృతి మంధాన పేరు చెప్తారు. అయితే.. హైలీ టాలెంటెడ్‌ కమ్‌ బ్యూటీఫుల్‌ క్రికెటర్‌గా పేరొందిన స్మృతి.. తాజాగా తన మనసు బంగారం అని నిరూపించుకుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Smriti Mandhana, Sri Lanka, Asia Cup 2024: ఉమెన్స్‌ క్రికెట్‌లో చాలా మందికి మోస్ట్‌ ఫేవరేట్‌ క్రికెటర్‌ ఎవరంటే స్మృతి మంధాన పేరు చెప్తారు. అయితే.. హైలీ టాలెంటెడ్‌ కమ్‌ బ్యూటీఫుల్‌ క్రికెటర్‌గా పేరొందిన స్మృతి.. తాజాగా తన మనసు బంగారం అని నిరూపించుకుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 21, 2024 | 12:04 PMUpdated Jul 21, 2024 | 12:04 PM
వీడియో: మరోసారి హృదయాలు కొల్లగొట్టిన స్మృతి మంధాన! చిన్నారి ఫ్యాన్‌ కోసం..

ఇండియన్‌ ఉమెన్స్‌ క్రికెట్‌కు తన సూపర్‌ బ్యాటింగ్‌తో గుర్తింపు తీసుకొచ్చిన క్రికెటర్‌ ఎవరంటే.. చాలా మంది చెప్పే పేరు స్మృతి మంధాన. మెన్స్‌ క్రికెట్‌ను మాత్రమే ఫాలో అయ్యేవాళ్లు కూడా ఉమెన్స్‌ క్రికెట్‌ను చూస్తున్నారంటే అందుకు కారణం స్మృతినే. సొగసైన బ్యాటింగ్‌తో పాటు అందమైన క్రికెటర్‌గా భారీ క్రేజ్‌ సంపాదించుకుంది. ఉమెన్స్‌ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ అనే పేరుంది తనకి. ఇప్పటికే తన అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియాను ఎన్నో మ్యాచ్‌ల్లో గెలిపించింది. అలాగే ఉమెన్స్‌ ఐపీఎల్‌ 2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును విజేతగా నిలిపింది. ఇలా క్రికెటర్‌గా ఎంతో ఎత్తుగా ఎదిగిన స్మృతి మంధాన.. ఒక మనిషిగా కూడా తన గొప్ప మనసును చాటుకుంది.

ప్రస్తుతం శ్రీలంక వేదికగా జరుగుతున్న ఉమెన్స్‌ ఆసియా కప్‌ 2024లో ఆడుతున్న స్మృతి మంధాన పాకిస్థాన్‌తో మ్యాచ్‌ కంటే ముందు తన చిన్నారి అభిమానని కలిసింది. తనను చూసేందుకు గ్రౌండ్‌కు వచ్చిన దివ్యాంగ చిన్నారి అభిమానితో ఆప్యాయంగా మాట్లాడింది. ఆ సమయంలో ఆ చిన్నారి ఫ్యాన్‌కు ఏం కావాలో తెలుసుకోవాలని.. మ్యాచ్‌ తర్వాత మళ్లీ ఆ చిన్నారి ఫ్యాన్‌ను కలిసి.. ఓ సూపర్‌ గిఫ్ట్‌తో తన అభిమానిని సంతోషపర్చిన స్మృతి మంధానపై క్రికెట్‌ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇంతకీ ఆ చిన్నారికి స్మృతి మంధాన ఏం గిఫ్ట్‌ ఇచ్చింది అనుకుంటున్నారా.. స్మార్ట్‌ ఫోన్‌ను బహుమతిగా అందించింది. ఆ ఫోన్‌ అందుకున్న చిన్నారి ఫ్యాన్‌ సంతోషంతో చిరునవ్వులు చిందించింది. తన అభిమాన క్రికెటర్‌ తన కోసం ఫోన్‌ కొని స్వయంగా తన చేతులతో అందజేయడంతో ఆ చిన్నారి కళ్లలో చెప్పలేని సంతోషం కనిపించింది. గిఫ్ట్‌ ఇచ్చిన తర్వాత.. చిన్నారితో కలిసి ఫొటోలు దిగింది మంధాన. ఇక మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించి.. ఆసియా కప్‌ వేటను విజయంతో ప్రారంభించిది. నేడు(ఆదివారం) యూఏఈతో టీమిండియా మ్యాచ్‌ ఆడనుంది. మరి చిన్నారి ఫ్యాన్‌కు స్మృతి మంధాన ఫోన్‌ గిఫ్ట్‌గా ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş