iDreamPost
android-app
ios-app

వీడియో: సిక్స్‌ కొట్టాడు.. అదే బంతికి ఔట్‌ అయ్యాడు! ఎలాగో తెలుసా?

  • Published Jul 26, 2023 | 1:27 PM Updated Updated Jul 26, 2023 | 1:39 PM
  • Published Jul 26, 2023 | 1:27 PMUpdated Jul 26, 2023 | 1:39 PM
వీడియో: సిక్స్‌ కొట్టాడు.. అదే బంతికి ఔట్‌ అయ్యాడు! ఎలాగో తెలుసా?

క్రికెట్‌లో చాలా రకాలుగా బ్యాటర్లు అవుట్‌ అవుతుంటారు. బౌల్డ్‌, రనౌట్‌, క్యాచ్‌ అవుట్‌, లెగ్‌ బిఫోర్‌ ఇలా ఉంటాయి అవుటయ్యే పద్ధతులు కొన్నిసార్లు ఖర్మకాలి హిట్‌ వికెట్‌గా కూడా అవుట్‌ అవుతారు. అది చాలా రేర్‌గా జరిగే అవుట్‌. కానీ.. భారీ షాట్‌ ఆడి, అది సిక్స్‌ వెళ్లిన తర్వాత హిట్‌ వికెట్‌ అయితే? ఆ బ్యాటర్‌ బాధను మాటల్లో వర్ణిచలేం. ఒకే బంతికి భారీ సిక్స్‌తో పాటు వికెట్‌ కూడా పడిన మోస్ట్‌ ఫన్నీ అండ్‌ ఇంట్రెస్టింగ్‌ సంఘటన తాజాగా చోటు చేసుకుంది.

కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2023లో భాగంగా జరుగుతున్న డివిజన్‌ వన్‌ పోటీల్లో మిడిల్‌సెక్స్‌ కెప్టెన్‌ టోబీ రోలాండ్‌ జోన్స్‌ అవుటైన విధానం ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాను ఎదుర్కొన్న 15వ బంతికి భారీ సిక్స్‌ కొట్టి అదే బాల్‌కి హిట్‌ వికెట్‌ రూపంలో అవుట్‌ అయ్యాడు పాపం. అతని అవుట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మ్యాచ్‌ విషయానికి వస్తే.. వార్విక్‌షైర్‌-మిడిల్‌సెక్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో మిడిల్‌సెక్స్‌ కెప్టెన్‌గా వ్యవహిరస్తున్న రోలాండ్‌ 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు బాది విచిత్రంగా అవుట్‌ అయ్యాడు. దీంతో మిడిల్‌సెక్స్‌ టీమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌట్‌ అయింది. మిడిల్‌సెక్స్‌ ఇన్నింగ్స్‌లో ర్యాన్‌ హిగ్గిన్స్‌ 53 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆ వెంటనే ఇన్నింగ్స్‌ ఆరంభించిన వార్విక్‌షైర్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. మరి ఈ మ్యాచ్‌లో రోలాండ్‌ అవుట్‌కు సంబంధించిన వీడియో కింద ఉంది. అది చూసి ఆ అవుట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బిగ్‌ బ్రేకింగ్‌: ఇండియా-పాకిస్థాన్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ వాయిదా!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom