ఈ IPLలో కొత్త టెక్నాలజీ! స్మార్ట్‌ రీప్లే సిస్టమ్‌తో మరింత మజాగా!

IPL 2024, Smart Replay System: ఐపీఎల్‌ 2024 సీజన్‌ను మరింత కచ్చితంగా నిర్వహించేందుకు ఐపీఎల్‌ నిర్వాహకులు కొత్త టెక్నాలజీని ఈ సీజన్‌లో ప్రవేశపెట్టనున్నారు. మరి ఆ టెక్నాలజీ ఏంటో? దాని కథేంటో ఇప్పుడు చూద్దాం..

IPL 2024, Smart Replay System: ఐపీఎల్‌ 2024 సీజన్‌ను మరింత కచ్చితంగా నిర్వహించేందుకు ఐపీఎల్‌ నిర్వాహకులు కొత్త టెక్నాలజీని ఈ సీజన్‌లో ప్రవేశపెట్టనున్నారు. మరి ఆ టెక్నాలజీ ఏంటో? దాని కథేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం సర్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే అన్ని టీమ్స్‌ కూడా ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. చాలా టీమ్స్‌ తన కొత్త జెర్సీలను కూడా రివీల్‌ చేసేశాయి. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ లాంటి స్టార్లు కూడా తమ తమ టీమ్స్‌తో చేరిపోవడంతో.. అప్పుడే ఐపీఎల్‌ ఫీవర్‌ క్రికెట్‌ అభిమానులకు ఎక్కేసింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఐపీఎల్‌ కోసం క్రికెట్‌ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ నెల 22న అంటే శుక్రవారం నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోటీ పడనుంది. అయితే.. ఈ సారి ఐపీఎల్‌లో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ క్రికెట్‌ అభిమానులకు ఎంతటి వినోదాన్ని ఇస్తుందో.. వ్యాపార పరంగా అంతటి లాభాలను కూడా తెచ్చిపెడుతుంది. అందుకే ఐపీఎల్‌లో ప్రతి నిమిషం, ప్రతి సెకను కూడా చాలా ముఖ్యం. ఒక్క క్షణం కూడా వేస్ట్‌ చేయకుండా ఆ ఐపీఎల్‌ టోర్నీలోని ప్రతి మ్యాచ్‌ను నిర్వహిస్తూ ఉంటారు నిర్వాహకులు. అయితే.. కొన్నిసార్లు రనౌట్‌, స్టంప్‌ అవుట్‌, ఎల్బీడబ్ల్యూ వంటి వాటిల్లో ఫీల్డ్‌ అంపైర్లు.. థర్డ్‌ అంపైర్‌ను సంప్రదించిన సమయంలో సరైన యాంగిల్‌ దొరక్క.. థర్డ్‌ అంపైర్లు తమ నిర్ణయాన్ని త్వరగా తీసుకోలేరు. అక్కడే చాలా టైమ్‌ వేస్ట్‌ అవుతుంది.

ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే ‘స్మార్ట్‌ రీప్లే సిస్టమ్‌’ను ప్రవేశపెట్టనున్నారు. ఈ టెక్నాలజీతో థర్డ్‌ అంపైర్ల పని చాలా సులువు కానుంది. చాలా యాంగిల్స్‌లో బాల్‌ను పరిశీలించే అవకావం ఈ స్మార్ట్‌ రీప్లే సిస్టమ్‌ ద్వారా ఉంటుంది. దాంతో.. థర్డ్‌ అంపైర్లు వేగంగా, కచ్చితంగా తమ డిసిషన్‌ను తెలియజేయడానికి వీలుంటుంది. ఈ స్మార్ట్‌ రీప్లే సిస్టమ్‌ వల్ల చాలా విజువల్స్‌ చూసే అవకాశం ఉంటుంది. అలాగే స్ప్లిట్‌ స్క్రీన్స్‌లో కూడా చూడొచ్చు. ఈ టెక్నాలజీతో చాలా ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరి ఈ కొత్త స్మార్ట్‌ రీప్లే సిస్టమ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments