Nidhan
Shreyas Iyer Slams Quickfire Fifty: స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బ్యాట్ ఎట్టకేలకు గర్జించింది. వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అయ్యర్.. దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్లో మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మెరుపు బ్యాటంగ్‌తో అలరించాడు.
Shreyas Iyer Slams Quickfire Fifty: స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బ్యాట్ ఎట్టకేలకు గర్జించింది. వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అయ్యర్.. దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్లో మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మెరుపు బ్యాటంగ్‌తో అలరించాడు.
Nidhan
టీమిండియాలో తక్కువ టైమ్‌లోనే మంచి క్రేజ్ సంపాదించిన ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ ఒకడు. స్టైలిష్ బ్యాటింగ్‌తో మూడు ఫార్మాట్లలో కీలక ప్లేయర్‌గా ఎదిగిన అయ్యర్.. గాయం సాకు చూపి డొమెస్టిక్ క్రికెట్ ఆడనని చెప్పడంతో బీసీసీఐ అతడి కాంట్రాక్ట్ తొలగించింది. అప్పటి నుంచి అతడి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. మధ్యలో ఐపీఎల్-2024 ట్రోఫీని గెలుచుకొని సంబురాల్లో మునిగినా.. టీ20 వరల్డ్ కప్‌కు సెలెక్ట్ కాలేదు. ఇటీవల శ్రీలంక సిరీస్‌లో వన్డే టీమ్‌కు ఎంపిక చేసినా రాణించలేదు. టెస్ట్ జట్టులోకి ఎంట్రీ కోసం దులీప్ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ తొలి రౌండ్లో విఫలమయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ సిరీస్‌కు అతడ్ని ఎంపిక చేయలేదు బోర్డు. ఇక అయ్యర్ పనైపోయింది అనుకుంటున్న తరుణంలో ఎట్టకేలకు అతడి బ్యాట్ గర్జించింది.
వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అయ్యర్.. దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్లో మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మెరుపు బ్యాటంగ్‌తో అలరించాడు. ఇండియా-సీతో జరుగుతున్న మ్యాచ్‌లో 37 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. ఇందులో 7 బౌండరీలతో పాటు 1 భారీ సిక్స్ ఉంది. క్రీజులో ఉన్నంత సేపు అటాకింగ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఎడాపెడా షాట్లు కొడుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. పాజిటివ్ క్రికెట్ ఆడుతూ తన బ్యాట్ పవర్ ఇంకా తగ్గలేదని ప్రూవ్ చేశాడు. తనలో పరుగుల దాహం ఇంకా తగ్గలేదని.. కసి మీద ఉన్నానని చూపించాడు. అయితే టీమిండియాలోకి కమ్‌బ్యాక్ ఇవ్వాలంటే ఇది సరిపోదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. భారత టెస్ట్ జట్టులో తీవ్ర పోటీ ఉన్నందున అయ్యర్ బ్యాట్ నుంచి భారీ స్కోర్లు వస్తే తప్ప కన్సిడర్ చేయరని చెబుతున్నారు.
భారీ సెంచరీలు బాది ఫామ్, ఫిట్నెస్ నిరూపించుకుంటే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు అయ్యర్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. దులీప్ ట్రోఫీతో పాటు రంజీ ట్రోఫీలోనూ అతడు బ్యాట్‌తో పరుగుల వరద పారించాలని.. అప్పుడు సెలెక్టర్ల మీద ఒత్తిడి పడుతుందని సూచిస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో ఇండియా-డీ తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-బీ 282 పరుగులు చేసింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇండియా-డీ ప్రస్తుతం 4 వికెట్లకు 125 పరుగులతో ఉంది. ఆ టీమ్ 192 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక, హాఫ్ సెంచరీ బాదిన అయ్యర్ భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉన్నా హిట్టింగ్‌కు వెళ్లి వికెట్ పారేసుకున్నాడు. అతడు క్రీజులో ఉంటే స్కోరు బోర్డు పరుగులు పెట్టేది. మరి.. అయ్యర్ ఏ సిరీస్‌కల్లా కమ్‌బ్యాక్ ఇస్తాడని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
37 BALL FIFTY BY SHREYAS IYER IN THE DULEEP TROPHY. 🔥 pic.twitter.com/sFObmemssV
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 21, 2024