iDreamPost
android-app
ios-app

ప్రభాస్‌ హీరోయిన్‌తో పేమలో పడ్డ టీమిండియా క్రికెటర్‌! నిజమెంత?

  • Published Mar 05, 2024 | 3:27 PM Updated Updated Mar 05, 2024 | 3:27 PM

Shreyas Iyer, Shraddha Kapoor: ఇటీవల బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆ బాధ నుంచి బయటపడుతూ.. ఓ హీరోయిన్‌తో డేటింగ్‌ చేస్తున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. మరి అందులో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..

Shreyas Iyer, Shraddha Kapoor: ఇటీవల బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆ బాధ నుంచి బయటపడుతూ.. ఓ హీరోయిన్‌తో డేటింగ్‌ చేస్తున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. మరి అందులో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 05, 2024 | 3:27 PMUpdated Mar 05, 2024 | 3:27 PM
ప్రభాస్‌ హీరోయిన్‌తో పేమలో పడ్డ టీమిండియా క్రికెటర్‌! నిజమెంత?

టీమిండియా యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఓ స్టార్‌ హీరోయిన్‌తో సీక్రెట్‌గా డేటింగ్‌ చేస్తున్నాడంటూ సోషల్‌ మీడియాతో పాటు కొన్ని జాతీయ మీడియా ఛానెల్స్‌లోనూ అయ్యర్‌ డేటింగ్‌ గురించి వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌తో శ్రేయస్‌ అయ్యర్‌ ప్రేమలో పడినట్లు.. ఇద్దరు డేటింగ్‌ కూడా షురూ చేసినట్లు భారీ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. శ్రద్ధ కపూర్‌ బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌ అలాగే తెలుగులో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన పాన్‌ ఇండియా మూవీ సాహోలో కూడా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఇప్పుడు టీమిండియా క్రికెటర్‌ అయ్యర్‌తో డేటింగ్‌ వార్తలతో మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది.

మరి వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందనే టాక్‌ ఎలా బయటికి వచ్చిందంటే.. ఈ మధ్యనే అయ్యర్‌-శ్రద్ధా కపూర్‌ ఓ యాడ్‌లో కలిసి నటించారు. ఓ ప్రముఖ మొబైల్‌ ఫోన్‌కు సంబంధించిన యాడ్‌లో వీరిద్దరు నటించారు. ఆ యాడ్‌ పుణ్యమా అని ఇద్దరి మధ్య ‍స్నేహం ఏర్పడింది. దీంతో.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాల్‌ కొట్టారు. అంతే.. సోషల్‌ మీడియాలో ఇద్దరి గురించి పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఇద్దరు ప్రేమలో పడ్డారని, రహస్యంగా డేటింగ్‌ కూడా చేస్తున్నారంటూ కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు. నిజానికి వీళ్లద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు కానీ, ప్రేమలో పడినట్లు కానీ ఎలాంటి ఆధారాలు లేవు. కనీసం ఇద్దరు కలిసి బయటి తిరిగి దాఖలాలు కూడా లేవు.

కేవలం ఒక యాడ్‌లో కలిసి నటించారు. తర్వాత ఇన్‌స్టాలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు అయితే.. వీరిద్దరి మధ్య అధికారికంగా ఉంది ఇంతే. దీన్ని ఆధారంగా చేసుకోని కొంతమంది ఇద్దరు లవ్‌లో పడ్డారని, డేటింగ్‌ కూడా చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. కాగా, తాజాగా శ్రద్ధా కపూర్‌ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు హాజరైన విషయం తెలిసిందే. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ రంజీ ట్రోఫీలో ముంబై తరఫున సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడి, ఫైనల్‌ కోసం సిద్ధం అవుతున్నాడు. ఇటీవల అతన్ని బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రక్ట్‌ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. దీంతో.. మళ్లీ టీమిండియాలో స్థానమే లక్ష్యంగా అయ్యర్‌ శ్రమిస్తున్నారు. ఇలా అయ్యర్‌, శ్రద్ధా తమ తమ పనుల్లో బిజీగా ఉంటే.. ఒక్క యాడ్‌ పట్టుకుని ఇద్దరి మధ్య ప్రేమ బంధం అల్లేశారు కొంతమంది. వారిద్దరు డేటింగ్‌ చేస్తున్నారని కచ్చితంగా చెప్పలేం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş