Shreyas Iyer: 5 టైటిళ్లు కొట్టిన రోహిత్, ధోని వల్ల కాలేదు.. ఆ ఘనత శ్రేయస్ అయ్యర్ సాధించాడు!

17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మహామహులు సాధించలేని రికార్డును తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఆ రికార్డ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మహామహులు సాధించలేని రికార్డును తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఆ రికార్డ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

శ్రేయస్ అయ్యర్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ గా ఇప్పటికే ఎంతో మంది దిగ్గజాల నుంచి కితాబు అందుకున్నాడు. ఇక ఐపీఎల్ 2024 సీజన్ లో కేకేఆర్ టీమ్ ను విజయవంతగా నడిపిస్తూ.. అచ్చమైన నాయకుడిగా ప్రశంసలు పొందుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కేకేఆర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. అయితే ఐపీఎల్ చరిత్రలోనే 5సార్లు టైటిళ్లు సాధించిన రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోనిలు సాధించలేని అరుదైన ఘనతను తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లోకి అడుగుపెట్టింది కోల్ కత్తా నైట్ రైడర్స్. నిన్న సన్ రైజర్స్ తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఇక ముచ్చటగా మూడో కప్ ను ముద్దాడాలని కేకేఆర్ ఆరాటపడుతోంది. ఈ సీజన్ లో మెంటర్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. మరీ ముఖ్యంగా కెప్టెన్ గా అయ్యర్ సూపర్ సక్సెస్ అయ్యాడు. తనలో సారథి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, టీమిండియాకు ఫ్యూచర్ కెప్టెన్ తానే అని మరోసారి చాటిచెప్పాడు.

ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ చరిత్రలో ఓ క్రేజీ రికార్డును నెలకొల్పాడు శ్రేయస్ అయ్యర్. తన అద్బుతమైన కెప్టెన్సీతో కోల్ కత్తాను ఫైనల్ కు చేర్చడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. ఐదు టైటిళ్లు సాధించిన రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోనిలు కూడా ఈ రికార్డును నెలకొల్పలేకపోయారు. అసలు విషయం ఏంటంటే? ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు రెండు వేర్వేరు ఫ్రాంచైజీల నుంచి ఫైనల్ కు చేరిన జట్లకు నాయకత్వం వహించిన ఏకైక కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. 2020 ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు అయ్యర్.

ఆ సీజన్ లో ఢిల్లీని ఫైనల్ కు చేర్చాడు. కానీ కప్ ను అందించలేకపోయాడు. ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మళ్లీ ఇప్పుడు కేకేఆర్ కు సారథ్యం వహిస్తూ.. జట్టును ఫైనల్ కు చేర్చాడు. దాంతో రెండు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఫైనల్ ఆడిన ఏకైక కెప్టెన్ గా అయ్యర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. హేమా హేమీలకే దక్కని గౌరవం అయ్యర్ దక్కించుకున్నాడు. మరి ఈ క్రేజీ రికార్డ్ సాధించిన అయ్యర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments