SNP
SNP
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఫీల్డింగ్‌లో నిరాశపరుస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఆస్ట్రేలియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆరంభంలోనే మార్ష్‌ను అవుట్ చేసిన మొహమ్మద్ షమీ అద్భుతమైన ఆరంభం అందించాడు. కానీ, మరింత పట్టుబిగించే క్రమంలో.. టీమిండియా ఫీల్డర్లు చెత్త ఫీల్డింగ్‌తో ఆస్ట్రేలియాకు ఊపిరిపోశారు. దాంతో డేవిడ్ వార్నర్-స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ జోడీని రవీంద్ర జడేజా విడదీసినా కానీ, టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యం తర్వాత కూడా కొనసాగింది.
తొలుత భారత జట్టులో మంచి ఫీల్డర్లలో ఒకడిగా పేరున్న శ్రేయాస్ అయ్యర్.. తన చేతుల్లోకి వచ్చిన సింపుల్ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అది కూడా ప్రమాదకరమైన డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్. శార్దూల్ వేసిన లెంగ్త్ బాల్‌ను మిడాఫ్ మీదుగా వార్నర్ పుష్ చేశాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్‌కు సింపుల్ క్యాచ్ వచ్చింది. దీన్ని అందుకోవడంలో అయ్యర్ తడబడ్డాడు. చేతుల్లోకి వచ్చిన బంతిని జారవిడిచాడు. ఆ తర్వాత వార్నర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ లైఫ్ తర్వాత.. జడేజా వేసిన ఇన్నింగ్స్ 23వ ఓవర్ తొలి బంతికి లబుషేన్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి బతికిపోయాడు. సూర్య వేగంగా అందించిన వాల్‌ను కేఎల్ రాహుల్ అందుకుని వికెట్లను కొట్టడంలో విఫలం కావడంతో ఆసీస్ మరో లైఫ్ దక్కింది. ఈ రెండు తప్పిదాలు చేయకుంటే.. టీమిండియా మరింత పట్టుబిగించేది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆస్ట్రేలియా 38 ఓవర్లు పూర్తి అయ్యే సమయానికి 4 వికెట్లు కోల్పయి 177 పరుగులు చేసింది. మధ్యలో వర్షం అంతరాయ కలిగించినా.. వెంటనే వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ వెంటనే తిరిగి ప్రారంభం అయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్(4), డేవిడ్ వార్నర్(52), స్టీవ్ స్మిత్(41), మార్నస్ లబుషేన్(39) పరుగులు చేసి అవుట్ అయ్యారు. కామెరున్ గ్రీన్ 25, జోస్ ఇంగ్లిస్ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 2 వికెట్ల పడగొట్టాడు. జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీశారు. మరి ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు చేసిన ఫీల్డింగ్‌పై, వదిలేసిన క్యాచ్‌లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ohhh 😯😯😯 Catch dropped by Shreyas Iyer !!!#INDvAUS pic.twitter.com/pbzX3HpOM6
— Harsh Parmar (@HarshPa56785834) September 22, 2023
kl rahul missed run out chance#INDvsAUS #KLRahul pic.twitter.com/MtSdGgHEBc
— Sayyad Nag Pasha (@nag_pasha) September 22, 2023
ఇదీ చదవండి: టీమిండియా వరల్డ్ కప్ గెలవాలంటే.. వాళ్లని ఓడించాలి: గంభీర్