iDreamPost
android-app
ios-app

Shoaib Malik: సానియాతో విడాకులు, మూడో పెళ్లిపై ఫస్ట్ టైమ్ స్పందించిన మాలిక్!

  • Published Jan 30, 2024 | 10:04 AM Updated Updated Jan 30, 2024 | 10:04 AM

సానియా మీర్జాతో విడాకులు, నటి సనా జావేద్ తో మూడో పెళ్లిపై తొలిసారి స్పందించాడు పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

సానియా మీర్జాతో విడాకులు, నటి సనా జావేద్ తో మూడో పెళ్లిపై తొలిసారి స్పందించాడు పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

  • Published Jan 30, 2024 | 10:04 AMUpdated Jan 30, 2024 | 10:04 AM
Shoaib Malik: సానియాతో విడాకులు, మూడో పెళ్లిపై ఫస్ట్ టైమ్ స్పందించిన మాలిక్!

పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు విడాకులు ఇచ్చి.. పాకిస్తాన్ నటి సనా జావేద్ ను మూడో పెళ్లి చేసుకున్నాడు మాలిక్. దీంతో అతడిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు నెటిజన్లు. ఇక ఈ విషయంపై సానియా తండ్రి కూడా స్పందించాడు. కానీ ఇప్పటి వరకు షోయబ్ మాలిక్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటూ కొందరు ప్రశ్నించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విడాకులపై, మూడో పెళ్లిపై తొలిసారి స్పందించాడు మాలిక్.

సానియా మీర్జాకు విడాకులు ఇచ్చి పాకిస్తాన్ కు చెందిన నటి సనా జావేద్ ను మూడో పెళ్లి చేసుకున్నాడు పాక్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్. దీంతో అతడిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. మాలిక్ ఓ మోసగాడని, సానియాకు ద్రోహం చేశాడని నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ విమర్శలన్నింటికీ సమాధానం ఇచ్చాడు మాలిక్. సానియాతో విడాకులు, మూడో పెళ్లిపై పరోక్షంగా స్పందించాడు ఈ స్టార్ క్రికెటర్.

shoaib reaction about his 3rd marriage

ఇంటర్వ్యూలో షోయబ్ మాలిక్ మాట్లాడుతూ..”మీ అందరికి నేను చెప్పేది ఒక్కటే. మన పక్కవారు ఏమనుకుంటున్నారు? వేరే వాళ్లు, సమాజం ఏమనుకుంటుందో మీకు అనవసరం. మీ మనసు మీకు ఏం చెబుతుందో.. అదే చేయండి. మీ లైఫ్ జర్నీలో జనాలు ఏమనుకుంటున్నారో అర్దం చేసుకోవడానికి చాలా టైమ్ పట్టొచ్చు. కొందరికి ఇది 10 ఏళ్లలో అర్ధమైతే.. మరికొందరికి 20 ఏళ్లు పట్టొచ్చు. అయితే మీరు ఎప్పుడు అర్ధం చేసుకున్నా సరే అది 20 సంవత్సరాలకే కావొచ్చు.. ముందుకుసాగండి” అంటూ చెప్పుకొచ్చాడు మాలిక్. కాగా.. డైరెక్ట్ గా విడాకుల గురించి, మూడో పెళ్లి పేర్లు ఎత్తకుండా.. తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చాడని నెటిజన్లు అభిప్రాయాపడుతున్నారు. ప్రస్తుతం మాలిక్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి షోయబ్ చేసిన ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by AK BUZZ (@akbuzzofficial)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet