iDreamPost
android-app
ios-app

Sana Javed: షోయబ్‌ మాలిక్‌ మూడో పెళ్లి చేసుకున్న అమ్మాయి బ్యాగ్రౌండ్‌!

  • Published Jan 20, 2024 | 3:26 PM Updated Updated Jan 20, 2024 | 3:26 PM

Shoaib Malik, Sana Javed: సానియా మీర్జాను 2010లో వివాహం చేసుకున్న పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ తాజాగా మరో వివాహం చేసుకున్నాడు. సనా జావేద్‌ అనే అమ్మాయిని ఆయన మూడో పెళ్లి చేసుకున్నాడు. మరి ఆ అమ్మాయి బ్యాగ్రౌండ్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Shoaib Malik, Sana Javed: సానియా మీర్జాను 2010లో వివాహం చేసుకున్న పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ తాజాగా మరో వివాహం చేసుకున్నాడు. సనా జావేద్‌ అనే అమ్మాయిని ఆయన మూడో పెళ్లి చేసుకున్నాడు. మరి ఆ అమ్మాయి బ్యాగ్రౌండ్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 20, 2024 | 3:26 PMUpdated Jan 20, 2024 | 3:26 PM
Sana Javed: షోయబ్‌ మాలిక్‌ మూడో పెళ్లి చేసుకున్న అమ్మాయి బ్యాగ్రౌండ్‌!

పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ తాజాగా మరో వివాహం చేసుకున్నాడు. పాకిస్థాన్‌ నటి సనా జావేద్‌తో తనకు నిఖా జరిగినట్లు.. ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు మాలిక్‌ స్వయంగా తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే.. ఇది షోయబ్‌కు మూడో వివాహం కాగా, సనా జావేద్‌కు రెండో పెళ్లి. 2010లో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను షోయబ్‌ మాలిక్‌ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి హైదరాబాద్‌లోనే అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి ఇజ్‌హాన్‌ మీర్జా మాలిక్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే.. సానియా మీర్జాను వివాహం చేసుకోవడానికి ముందే మాలిక్‌ ఆయేషా సిద్ధిఖీ అనే అమ్మాయితో పెళ్లి జరిగిందని, తర్వాత వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారనే విషయం తెలిసింది.

అయితే.. సానియా-మాలిక్‌ పెళ్లి తర్వాత కొంతకాలం హ్యాపీగా కలిసి ఉన్నారు. దుబాయ్‌లో కాపురం పెట్టినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కొడుకు పుట్టిన కొన్నేళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు పుకార్లు వచ్చాయి. ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని, విడాకులు కూడా తీసుకుంటారనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ, వీటిపై మాలిక్‌ కానీ, సానియా కానీ స్పందించలేదు. దీంతో.. అవన్నీ పుకార్లే అని కూడా కొంతమంది వారి దాంపత్యంపై నమ్మకం ఉంచారు. కానీ, ఇప్పుడు సడెన్‌గా షోయబ్‌ మలిక్‌, సనా జావేద్‌ను పెళ్లి చేసుకోవడంతో.. సానియా-మాలిక్‌ విడాకులు తీసుకున్నారని అంతా భావిస్తున్నారు. కాగా, మాలిక్‌ను పెళ్లి చేసుకునే ముందు సానియాకు అప్పటికే తన చిన్ననాటి మిత్రుడితో నిశ్చితార్థం జరిగింది. కానీ, కొన్ని కారణాలతో ఆ నిశ్చితార్థం రద్దు అయింది. ఆ తర్వాత సానియా, మాలిక్‌ను పెళ్లి చేసుకుంది.

షోయబ్‌ను రెండో పెళ్లి చేసుకున్న సనా జావేద్‌ బ్యాగ్రౌండ్‌..
తాజాగా షోయబ్‌ మాలిక్‌ను వివాహమాడిన సనా జావేద్‌ ఒక నటి. పాకిస్థాన్‌ డైలీ సీరియల్స్‌తో నటించింది. 2012లో షెహర్-ఎ-జాత్‌తో టెలివిజన్ రంగంలో ఎంట్రీ ఇ‍చ్చారు. రొమాంటిక్ డ్రామా ఖానీలో టైటిల్ రోల్ పోషించిన తర్వాత ఆమె గుర్తింపు పొందారు. ఆమె నటించిన రుస్వాయి, డంక్‌ సోషల్ డ్రామాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. 2020లో పాకిస్థానీ నటుడు, గాయకుడు-గేయ రచయిత ఉమైర్ జస్వాల్‌‌ను సనా జావేద్‌ వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులకే వాళ్లిద్దరూ విడిపోయారు. మళ్లీ ఇప్పుడు షోయబ్‌ మాలిక్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. మరి సానియాకు విడాకులిచ్చి.. మాలిక్‌ మరో వివాహం చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss