World Cup 2023: టీమిండియా క్రికెటర్‌పై వాట్సన్‌ ప్రశంసలు! సూపర్‌ హ్యూమన్‌ అంటూ..

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ టీమిండియా స్టార్‌ క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ క్రికెటర్‌ ప్రపంచ క్రికెట్‌లో ఓ అద్భుతమంటూ పేర్కొన్నాడు. మరి వాట్సన్‌ నుంచి అంత పెద్ద కితాబు అందుకున్న ఆ క్రికెటర్‌ ఎవరో చూద్దాం..

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ టీమిండియా స్టార్‌ క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ క్రికెటర్‌ ప్రపంచ క్రికెట్‌లో ఓ అద్భుతమంటూ పేర్కొన్నాడు. మరి వాట్సన్‌ నుంచి అంత పెద్ద కితాబు అందుకున్న ఆ క్రికెటర్‌ ఎవరో చూద్దాం..

వరల్డ్‌ కప్‌ టోర్నీలో టీమిండియా ఆటగాళ్లంతా అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఏ జట్టు ఎదురుపడినా.. చిత్తుగా ఓడిస్తూ.. సూపర్‌ స్పీడ్‌తో బ్రేకుల్లేని బుల్లెట్‌ బండిలా దూసుకెళ్తున్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ టీమిండియా రెండు కళ్లలాంటి ఆటగాళ్లు. వాళ్లిద్దరూ కూడా సూపర్‌ ఫామ్‌లో ఉండటం జట్టు ఎంతో ఆత్మ విశ్వాసాన్ని ఇస్తోంది. వారితో పాటు కేఎల్‌ రాహుల్‌, ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ మంచి టచ్‌లో ఉండటం, బౌలర్లు బుమ్రా, షమీ, కుల్దీప్‌ యాదవ్‌ అయితే.. కెరీర్‌ పీక్‌లో ఉన్నట్లు బౌలింగ్‌ చేస్తున్నారు. దీంతో టీమిండియా నెక్ట్స్‌ లెవెల్‌ టీమ్‌లా ఆడుతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ సేన అన్ని మ్యాచ్‌ల్లోనూ నెగ్గి.. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది.

ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ లాంటి పెద్ద టీమ్స్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ లాంటి చిన్న టీమ్స్‌ను ఓడించిన టీమిండియా.. తాజాగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను సైతం మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఇక గురువారం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో శ్రీలంకతో పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియానే హాట్‌ పేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. కాగా, ఈ మ్యాచ్‌కి ముందు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ప్రస్తుతం వరల్డ్‌ కప్‌ టోర్నీలో కామెంటేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న షేన్‌ వాట్సన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని ఉద్దేశిస్తూ.. వాట్సన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వాట్సన్‌ మాట్లాడుతూ..‘క్రికెట్ అద్భుతాల్లో విరాట్ కోహ్లీ ఒకరు. గ్రౌండ్‌లో కోహ్లీ చూపించే ఇంటెన్స్‌సిటీ చూస్తే.. సూపర్‌ హ్యూమన్‌లా అనిపిస్తాడు’ అంటూ పేర్కొన్నాడు. కాగా, కోహ్లీతో కలిసి వాట్సన్‌ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కూడా ఆడిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఆటగాళ్ల మంచి స్నేహం ఉంది. కాగా, ప్రస్తుతం వరల్డ్‌ కప్‌లో విరాట్‌ కోహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఓ సెంచరీ కూడా బాదేశాడు. రెండు మ్యాచ్‌ల్లో సెంచరీకి చేరువగా వచ్చి అవుట్‌ అయ్యాడు. ముఖ్యంగా టోర్నీ ఆరంభంలో ఆస్ట్రేలియాతోనే జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ హైలెట్‌. మరి కోహ్లీపై వాట్సన్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments