iDreamPost
android-app
ios-app

వీడియో: రోహిత్‌ శర్మకు ముద్దు పెట్టబోయిన స్టార్‌ క్రికెటర్‌! ఊహించని ఘటన..

  • Published Apr 22, 2024 | 10:48 AM Updated Updated Apr 22, 2024 | 10:48 AM

Shane Bond, Rohit Sharma; ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఓ స్టార్‌ క్రికెటర్‌ ముద్దు పెట్టుకోబోయాడు. ఈ షాకింగ్‌ ఘటనతో రోహిత్‌ శర్మ ఉలిక్కిపడ్డాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Shane Bond, Rohit Sharma; ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఓ స్టార్‌ క్రికెటర్‌ ముద్దు పెట్టుకోబోయాడు. ఈ షాకింగ్‌ ఘటనతో రోహిత్‌ శర్మ ఉలిక్కిపడ్డాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 22, 2024 | 10:48 AMUpdated Apr 22, 2024 | 10:48 AM
వీడియో: రోహిత్‌ శర్మకు ముద్దు పెట్టబోయిన స్టార్‌ క్రికెటర్‌! ఊహించని ఘటన..

టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు సాధారణ వ్యక్తులే కాదు.. స్టార్ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు కూడా అభిమానులుగా ఉన్నారు. రోహిత్‌ను కొన్ని కోట్ల మంది అభిమానిస్తుంటారు. అలాగే రోహిత్‌ కలిసి ఆడిన క్రికెటర్లు, అతనితో కలిసి పనిచేసిన మాజీ క్రికెటర్లు సైతం.. రోహిత్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ చూపిస్తారు. ఎందుకంటే.. వారికి రోహిత్‌తో ఉంటే అనుబంధం అలాంటిది. రోహిత్‌తో ఒక్కసారి బాండింగ్‌ ఏర్పడితే.. అది ఎన్ని ఏళ్లు అయినా అలాగే ఉంటుందని నిరూపించే ఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రోహిత్‌ శర్మ ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2024లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య సోమవారం రాత్రి మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరుజట్లు ఇప్పటికే అక్కడికి చేరుకుని ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టాయి. ముంబై ఇండియన్స్‌ క్యాంప్‌లో రోహిత్‌ శర్మ ప్రాక్టీస్‌లో ఉన్న సమయంలో.. రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ బాండ్‌ వచ్చి.. రోహిత్‌ శర్మకు ముద్దు పెట్టబోయాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రోహిత్‌ శర్మ.. తర్వాత బాండ్‌ను చూసి నవ్వుకున్నాడు. షేన్‌ బాండ్‌ ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

అలాగే గతంలో ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌ కూడా పనిచేయడంతో.. రోహిత్‌ శర్మతో అతనికి మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉంది. ఈ బాండింగ్‌తోనే షేన్‌ బాండ్‌ రోహిత్‌ శర్మకు ముద్దుపెట్టి ఆప్యాయంగా పలకరించబోయాడు. ఈ లోపు రోహిత్‌ చూసి.. కంగారు పడటంతో షేన్‌ బాండ్‌ పెట్టాల్సిన ముద్దు కాస్త మిస్‌ అయిపోయింది. అయితే.. రోహిత్‌కు బాండ్‌ ముద్దు పెట్టబోతున్న వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్‌ శర్మను ఎవరైనా అభిమానించాల్సిందే అంటూ సోషల్‌ మీడియా వేదికగా అతని ఫ్యాన్స్‌ అంటున్నారు. కాగా, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రస్తుతం టేబుల్‌ టాపర్‌గా ఉంది. 7 మ్యాచ్‌ల్లో 6 గెలిచింది, మరోవైపు ముంబై 7లో మూడు గెలిచి ఏదో స్థానంలో ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి. అయితే.. మరి రోహిత్‌కు షేన్‌బాండ్‌ ముద్దు పెట్టేందుకు ప్రయత్నించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetcasibomCasibomcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş