Shamar Joseph: ఒక్క మ్యాచ్​ తో మారిపోయిన లైఫ్.. జోసెఫ్ ​పై కురుస్తున్న కోట్ల వర్షం!

ఒకే ఒక్క మ్యాచ్ తో విండీస్ నయా సంచలనం షమర్ జోసెఫ్ జీవితం మారిపోయింది. ఆసీస్ పై చేసిన సంచలన ప్రదర్శన కారణంగా అతడిపై కాసుల వర్షం కురుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఒకే ఒక్క మ్యాచ్ తో విండీస్ నయా సంచలనం షమర్ జోసెఫ్ జీవితం మారిపోయింది. ఆసీస్ పై చేసిన సంచలన ప్రదర్శన కారణంగా అతడిపై కాసుల వర్షం కురుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

షమర్ జోసెఫ్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతున్న పేరు. ఇతడి బౌలింగ్ కు దిగ్గజాలు సైతం సలాం చేస్తున్నారు. ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే గడగడలాడించి.. విండీస్ కు 27 సంవత్సరాల నిరీక్షణ తర్వాత చారిత్రక విజయాన్ని అందించాడు జోసెఫ్. గబ్బా వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసి, 8 పరుగుల తేడాతో ఆసీస్ ను మట్టికరిపించాడు ఈ చిచ్చర పిడుగు. దీంతో ఈ కరేబియన్ స్పీడ్ స్టర్ పై వరల్డ్ వైడ్ గా ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా.. ఈ ప్రశంసలతో పాటుగా అతడి లైఫ్ కూడా మారిపోయింది. ఒకే ఒక్క మ్యాచ్ తో షమర్ పై కాసుల వర్షం కురుస్తోంది. అందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

గబ్బా వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో విండీస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆ విజయాన్ని కళ్లారా చూసిన వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ ఏకంగా గ్రౌండ్ లోనే భావోద్వేగానికి గురై.. కన్నీరు పెట్టుకున్నాడు. ఈ చారిత్రాత్మక గెలుపుతో కరేబియన్ ఆటగాళ్ల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. కాగా.. తాను ఆడుతున్న రెండో టెస్ట్ లోనే ఆసీస్ లాంటి మేటి జట్టును బెంబేలెత్తించాడు విండీస్ నయా సంచలనం షమర్ జోసెఫ్. 7 వికెట్లు తీసి ఒంటి చోత్తో మ్యాచ్ ను గెలిపించి, హీరోగా మారాడు. ఇక ఈ మ్యాచ్ జోసెఫ్ జీవితాన్నే మలుపు తిప్పింది. తన బౌలింగ్ ప్రదర్శనతో ప్రపంచ చూపును ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు జోసెఫ్. ఈ చిచ్చర పిడుగు ప్రదర్శనతో టీ20 లీగులు అన్నీ అతడి కోసం పరుగులు పెడుతున్నాయి.

గబ్బా మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడటానికి సంతకం చేశాడు జోసెఫ్. షమర్ ఈ లీగ్ లో పెషావర్ జల్మీ జట్టుకు ఆడటానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. మరోవైపు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ILT20)లో కూడా రంగ ప్రవేశం చేయనున్నాడని సమాచారం. దీంతో షమర్ పై కోట్ల వర్షం కురవడం ఖాయం. ఒకే ఒక్క మ్యాచ్ తో తన జీవితాన్నే మార్చుకున్నాడు షమర్ జోసెఫ్. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే.. ఐపీఎల్ తో పాటు మరి లీగుల్లో అతడు ఆడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి సెక్యూరిటీ గార్డు నుంచి స్టార్ క్రికెటర్ గా తన జీవితాన్ని మార్చుకున్న షమర్ జోసెఫ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments