Shamar Joseph: వీడియో: వెస్టిండీస్‌ బ్యాటర్‌ భారీ సిక్సర్‌! గాయపడిన ప్రేక్షకులు

Shamar Joseph, ENG vs WI: భారీ భారీ సిక్సులకు వెస్టిండీస్‌ క్రికెటర్లు పెట్టింది పేరు. అయితే.. తాజాగా ఓ వెస్టిండీస్‌ క్రికెటర్‌ కొట్టిన ఓ పెద్ద సిక్స్‌ ఏకంగా ఐదుగురు ప్రేక్షకులను గాయపర్చింది. దాని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..

Shamar Joseph, ENG vs WI: భారీ భారీ సిక్సులకు వెస్టిండీస్‌ క్రికెటర్లు పెట్టింది పేరు. అయితే.. తాజాగా ఓ వెస్టిండీస్‌ క్రికెటర్‌ కొట్టిన ఓ పెద్ద సిక్స్‌ ఏకంగా ఐదుగురు ప్రేక్షకులను గాయపర్చింది. దాని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్‌లో బ్యాటర్ల కొట్టే భారీ సిక్సర్లు కొన్నిసార్లు స్టేడియంలో మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులను గాయాలపాలు చేస్తుంటాయి. చాలా సార్లు కెమెరామెన్ల తలకాయలు కూడా పగిలాయి. తాజాగా ఓ భారీ సిక్సర్‌తో ఏకంగా ఐదుగురు ప్రేక్షకులు గాయపడ్డారు. ఈ సంఘటన ఇంగ్లండ్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. వెస్టిండీస్‌ బ్యాటర్‌ షమార్‌ జోసెఫ్‌ కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు స్టేడియంలో కూర్చోని మ్యాచ్‌ చూస్తున్న ప్రేక్షకుల్లో ఐదుగురు గాయపడినట్లు సమాచారం. మరి ఈ ఘటన ఎలా చోటు చేసుకుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌ బ్రిడ్జ​ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస​్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఇంగ్లండ్‌ బౌలర్‌ గుస్ అట్కిన్సన్ వేసిన ఇన్నింగ్స్‌ 107వ ఓవర్‌లో నాలుగో బంతికి వెస్టిండీస్‌ బ్యాటర్‌ షమార్‌ జోసెఫ్‌ మిడ్‌ వికెట్‌ పై నుంచి ఓ భారీ సిక్సర్‌ కొట్టాడు. అది వెళ్లి స్టేడియం పై కప్పుపై పడింది. బాల్‌ బలంగా ఢీకొట్టడంతో పైకప్పుపై ఉన్న పెక్కులు పగిలి.. కిందికి వేగంగా జారి.. కింద కూర్చున్న ప్రేక్షకులపై పడ్డాయి. ఆ పెక్కులు తగలడంతో పాటు బాల్‌ కూడా కింద పడి తగలడంతో నలుగురైదుగురు గాయపడినట్లు తెలుస్తోంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 416 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓలీ పోప్‌ 121 పరుగులు చేసి రాణించాడు. ఇక వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌కు దిగి 457 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. విండీస్‌ బ్యాటర్లలో కావెం హాడ్జ్‌ 120 పరుగులు చేసి అదరగొట్టాడు. చివరల్లో షమర్‌ జోసెఫ్‌ సైతం 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో ఇంగ్లండ్‌ బౌలర్లను బెంబేలెత్తించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడుతోంది. ఆ నాలుగో రోజు లంచ్‌ సమయానికి ఇంగ్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసి.. 307 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. ఇంగ్లండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌ సెంచరీతో చెలరేగాడు. 132 బంతుల్లో 13 ఫోర్లతో 109 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. అలాగే ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ 76, ఓలీ పోప్‌ 51 పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు. జో రూట్‌ 81 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. మరి ఈ మ్యాచ్‌లో షమర్‌ జోసెఫ్‌ సిక్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments