iDreamPost
android-app
ios-app

Shakib Al Hasan: MPగా గెలిచిన రోజే వివాదంలో షకీబ్ అల్ హసన్! వైరలవుతున్న వీడియో..

  • Published Jan 08, 2024 | 10:01 AM Updated Updated Jan 08, 2024 | 10:01 AM

బంగ్లాదేశ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఎంపీగా ఘన విజయం సాధించాడు. అయితే ఎంపీగా గెలిచిన రోజే వివాదంలో చిక్కుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

బంగ్లాదేశ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఎంపీగా ఘన విజయం సాధించాడు. అయితే ఎంపీగా గెలిచిన రోజే వివాదంలో చిక్కుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

  • Published Jan 08, 2024 | 10:01 AMUpdated Jan 08, 2024 | 10:01 AM
Shakib Al Hasan: MPగా గెలిచిన రోజే వివాదంలో షకీబ్ అల్ హసన్! వైరలవుతున్న వీడియో..

షకీబ్ అల్ హసన్.. గత కొద్దిరోజులుగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తున్నాడు. శ్రీలంక ప్లేయర్ మాథ్యూస్ టైమ్డ్ అవుట్ వివాదంతో పాటుగా.. గతంలో అంపైర్ అవుట్ ఇవ్వలేదని కోపంతో వికెట్లను తన్నాడు షకీబ్. అదీకాక బంగ్లా ఆటగాడు లిట్టన్ దాస్ వరల్డ్ కప్ లో ఆడితే.. తాను కెప్టెన్సీతో పాటుగా జట్టు నుంచి తప్పుకుంటాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉండగా మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు ఈ బంగ్లా స్టార్ బ్యాటర్. బంగ్లాదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన షకీబ్.. భారీ మెజార్టీతో విజయం సాధించాడు. అయితే అతడు గెలిచిన రోజే వివాదంతో వార్తల్లోకి నిలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బంగ్లాదేశ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఎంపీగా ఘన విజయం సాధించాడు. ఆ దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ తరఫున మగురా పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన షకీబ్.. ఏకంగా లక్షా యాభై వేల భారీ మెజార్టీతో గెలుపొందాడు. ఈ ఎన్నికల్లో కొద్దిరోజులే ప్రచారం చేసిన షకీబ్, ఇంత మెజార్టీ రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఎంపీగా గెలిచిన రోజే వివాదంతో చిక్కుకున్నాడు షకీబ్. పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న క్రమంలో షకీబ్ తో ఫొటోలు, షేక్ హాండ్స్ తీసుకోవడానికి అభిమానులు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన బంగ్లా కెప్టెన్ ఓ అభిమానిని చెంప దెబ్బకొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

bangladesh cricketer shakeeb ul hasan

ఇప్పటికే పలు వివాదాలతో విమర్శలపాలవుతూ.. వస్తున్న షకీబ్ మరో కాంట్రవర్సీని క్రియేట్ చేశాడు. దీంతో షకీబ్ నువ్వింక మారవా? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రాజకీయాల్లోకి వచ్చి.. ఇలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. మాథ్యూస్ టైమ్డ్ అవుట్, వికెట్లను తన్నడం, లిట్టన్ దాస్ ను జట్టులోకి తీసుకోవద్దు అని చెప్పడం లాంటి వివాదాలతో వార్తల్లో నిలిచాడు షకీబ్. తాజాగా ఓ ఫ్యాన్ కొట్టి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఇక బంగ్లా సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీకి భారీ మెజార్టీ లభించింది. 300 సీట్లకు గాను ఆ పార్టీ ఏకంగా 200 సీట్లను గెలుచుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. మరి షకీబ్ అభిమానిని కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom