iDreamPost
android-app
ios-app

World Cup: భారత్ పై ఐదు వికెట్లు తీశాకే సెల్పీలు.. పాక్ బౌలర్ ఓవరాక్షన్

  • Published Oct 13, 2023 | 7:51 PM Updated Updated Oct 13, 2023 | 7:51 PM
  • Published Oct 13, 2023 | 7:51 PMUpdated Oct 13, 2023 | 7:51 PM
World Cup: భారత్ పై ఐదు వికెట్లు తీశాకే సెల్పీలు.. పాక్ బౌలర్ ఓవరాక్షన్

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా రేపు జరుగబోయే భారత్, పాక్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం బీసీసీఐ తగు ఏర్పాట్లు చేస్తోంది. పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే ప్రతి క్షణం ఉత్కంఠభరితమే. నువ్వా నేనా అన్నట్లుగా సాగే ఆ మ్యాచ్ లో ఓ యుద్ధవాతావరణమే కనిపిస్తుంటుంది. పాక్ ఆటగాళ్ల కవ్వింపు చర్యలు మ్యాచ్ ను మరింత రసవత్తరంగా మారుస్తాయి. కాగా భారత్, పాక్ మ్యాచ్ కి ముందు పాక్ బౌలర్ ఓవరాక్షన్ చేశాడు. భారత్ పై ఐదు వికెట్లు తీశాకే సెల్ఫీలు ఇస్తానంటూ ప్రగల్బాలు పలికాడు. ఆ బౌలర్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది.

పాకిస్థాన్ పేస్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది జట్టులో కీలకమైన ఆటగాడు. తన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే సత్తా ఉన్నోడు. కాగా రేపు జరగబోయే మ్యాచ్ కోసం భారత్, పాక్ జట్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. విజయం సాధించాలని ఇరు జట్లు దృఢ సంకల్పంతో బరిలోకి దిగబోతున్నాయి. ఈ నేపథ్యంలో షాహిన్ షా అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ పై ఐదు వికెట్లు పడగొట్టాకే సెల్ఫీలు ఇస్తానంటూ అతి చేశాడు.

నెట్ లో ప్రాక్టీస్ పూర్తి చేసుకుని వెళ్తున్న షాహిన్ ను ఓ అభిమాని సెల్ఫీ కావాలని కోరాడు. ఆ సమయంలో ఆఫ్రిది రేపటి మ్యాచ్ లో భారత్ పై ఐదు వికెట్లు తీశాకే సెల్ఫీలు ఇస్తానంటూ చెప్పాడు. దీనిపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన బౌలర్ అయినంత మాత్రాన ఇంత ఓవరాక్షన్ అవసరమా అంటూ ఏకిపారేస్తున్నారు. మరి రేపటి మ్యాచ్ లో ఆఫ్రిది ఐదు వికెట్లు తీస్తాడా లేక భారత బ్యాటర్ల చేతిలో చిత్తై పోతాడా అనేది తేలాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet