IND vs BAN: వీడియో: క్యాచ్ మిస్.. కానీ నీ అటెంమ్ట్ కు దండంపెట్టాలి సామీ!

వీడియో: క్యాచ్ మిస్.. కానీ నీ అటెంమ్ట్ కు దండంపెట్టాలి సామీ!

  • Author Soma Sekhar Published - 03:14 PM, Fri - 6 October 23
  • Author Soma Sekhar Published - 03:14 PM, Fri - 6 October 23
వీడియో: క్యాచ్ మిస్.. కానీ నీ అటెంమ్ట్ కు దండంపెట్టాలి సామీ!

ఏషియన్ గేమ్స్ లో భాగంగా తాజాగా జరిగిన తొలి సెమీఫైనల్స్ లో టీమిండియా విజయభేరి మోగించింది. బంగ్లాదేశ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో బంగ్లాను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. దీంతో టీమిండియాకు పతకం కూడా ఖాయమైంది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. సీనియర్ల కంటే ఫీల్డింగ్ లో తోపులని ఈ మ్యాచ్ లో నిరూపించారు కుర్రాళ్లు. షాదాబ్ ఖాన్ తన అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

వరల్డ్ కప్ ముందు టీమిండియా సీనియర్ జట్టును కలవర పెట్టిన ఒకే ఒక సమస్య ఫీల్డింగ్. బ్యాటింగ్, బౌలింగ్ లో ఎంతో పటిష్టంగా ఉన్న టీమిండియా ఫీల్డింగ్ లో మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇటీవల జరిగిన సిరీస్ లే ప్రామాణికంగా తీసుకుంటే.. ఎన్ని సింపుల్ క్యాచ్ లు వదిలేశారో టీమిండియా ఆటగాళ్లు మనకు తెలియనిది కాదు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలు గెలవాలంటే బ్యాటింగ్, బౌలింగే కాదు.. ఫీల్డింగ్ లో కూడా సత్తా చాటడం ఎంతో అవసరం. ప్రస్తుతం టీమిండియా సీనియర్లు చేసిన తప్పిదాలు యంగ్ ఇండియన్ ప్లేయర్లు దాటేశారనే చెప్పాలి.

ఇందుకు ఉదాహరణ తాజాగా బంగ్లాతో జరిగిన మ్యాచే. ఈ మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయర్లు అద్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నారు. చివరి ఓవర్లో షహబాజ్ అహ్మద్ చేసిన కళ్లు చెదిరే ఫీల్డింగ్ చూస్తే.. ఔరా అనాల్సిందే. బంగ్లా ఇన్నింగ్స్ 19వ ఓవర్ రెండో బంతికి బంగ్లా బ్యాటర్ భారీ షాట్ కు ప్రయత్నించాడు. బాల్ అమాంతం గాల్లోకి లేచింది. అందరూ బాల్ సిక్స్ పోతుందని అనుకున్నారు. కానీ బుల్లెట్ వేగంతో వచ్చిన షహబాజ్ అహ్మద్ బాల్ ను సిక్స్ పోకుండా నియంత్రించాడు. కొద్దిలో సూపర్ క్యాచ్ పట్టేవాడే కానీ బ్యాలెన్స్ ఔట్ కావడంతో క్యాచ్ మిస్ అయ్యి.. రన్స్ మాత్రం కాపాడాడు. ఇక ఈ క్యాచ్ అటెంమ్ట్ చూసిన క్రికెట్ ఫ్యాన్స్ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. దీంతో సీనియర్లలో ఉన్న ఫీల్డింగ్ మైనస్ ను జూనియర్లు దాటి వస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో సాయి కిశోర్ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 9.2 ఓవర్లలోనే ఛేదించింది టీమిండియా. తిలక్ వర్మ థండర్ ఫిఫ్టీతో దుమ్మురేపాడు. అతడు కేవలం 26 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక కెప్టెన్ గైక్వాడ్ కూడా 26 బంతుల్లో 40 పరుగులతో చెలరేగాడు. కాగా.. ఫైనల్ పోరులో ఇండియా-ఆఫ్గానిస్థాన్ తలపడనున్నాయి.

Show comments