ఆ టైమ్ లో శాంసన్ కు ఒక్కటే చెప్పా! ఢిల్లీ జట్టులో సంజూతో కలిసి ఆడటంపై పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Rishabh Pant-Sanju Samson: ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున సంజూ శాంసన్ లో ఆడిన టైమ్ లో అతడికి ఓ విషయం చెప్పానని, అప్పుడు మా ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుండేదని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు రిషబ్ పంత్. ఆ వివరాల్లోకి వెళితే..

Rishabh Pant-Sanju Samson: ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున సంజూ శాంసన్ లో ఆడిన టైమ్ లో అతడికి ఓ విషయం చెప్పానని, అప్పుడు మా ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుండేదని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు రిషబ్ పంత్. ఆ వివరాల్లోకి వెళితే..

రిషబ్ పంత్ – సంజూ శాంసన్.. ఈ ఐపీఎల్ సీజన్ లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్నారు. దాంతో జూన్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2024కు బీసీసీఐ వారిని జట్టులోకి తీసుకుంది. కారు ప్రమాదం నుంచి వేగంగా కోలుకున్న పంత్.. ఈ సీజన్ లో ఇటు కీపింగ్, అటు బ్యాటింగ్ లో రాణిస్తున్నాడు. కెప్టెన్ గా కూడా తన ప్రతిభను కనబరుస్తున్నాడు. ఇక శాంసన్ కూడా బ్యాటింగ్, కెప్టెన్ గా సత్తాచాటుతున్నాడు. అయితే తమ జోడీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేేశాడు రిషబ్ పంత్. వీరిద్దరు గతంలో ఢిల్లీకి కలిసి ఆడారు. అప్పుడు జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా జియో సినిమాతో పంచుకున్నాడు.

సంజూ శాంసన్-రిషబ్ పంత్ లు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి తాజాగా జియో సినిమాతో మాట్లాడుతూ.. చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్. పంత్-శాంసన్ గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ కు కలిసి ఆడారు. అప్పుడు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ఇదే విషయాన్ని తాజాగా తెలియపరిచాడు. జియో సినిమాతో పంత్ మాట్లాడుతూ..”ఢిల్లీ తరఫున మేమిద్దరం కలిసి ఆడుతున్నప్పుడు మా పార్ట్ నర్ షిప్ సూపర్. అయితే ఒకసారి శాంసన్ నా దగ్గరి వచ్చి గేమ్ ప్లాన్ ఏంటి? అని అడిగాడు. దానికి నేను ఏం లేదు.. దంచి కొట్టడమే, ఇద్దరం కలిసి చితక్కొట్టేద్దాం” అంటూ ఆన్సర్ ఇచ్చినట్లు తాజాగా తెలిపాడు పంత్.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వీరిద్దరు పొట్టి వరల్డ్ కప్ లో స్థానం సంపాదించుకున్నారు. అయితే జట్టులో వీరిద్దరి చోటు ఉంటుందా? అన్నది కాస్త అనుమానమే. ఎందుకంటే? ఇద్దరు వికెట్ కీపర్లు కావడమే దానికి కారణం. కానీ శాంసన్ ఫీల్డింగ్ కూడా చేయగలుగుతాడు కాబట్టి.. టీమ్ లో ఉండే ఛాన్స్ లు ఉన్నాయి. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో శాంసన్ ఇప్పటి వరకు ఆడిన 9  మ్యాచ్ ల్లో 385 పరుగులు చేశాడు. ఇక పంత్ విషయానికి వస్తే.. 11 మ్యాచ్ ల్లో 398 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే ఇద్దరికి టీ20 ప్రపంచ కప్ లో స్థానం దక్కింది.

Show comments