విరాట్‌ కోహ్లీ కాదు.. టీమిండియాలో అతనొక్కడే బెస్ట్‌ ప్లేయర్‌: మాజీ క్రికెటర్‌

Sanjay Manjrekar, Jasprit Bumrah, Virat Kohli, T20 World Cup 2024: టీమిండియాలో బెస్ట్‌ ప్లేయర్‌ అంటే అతనొక్కడే.. విరాట్‌ కోహ్లీ కూడా కాదు.. అంటూ భారత మాజీ ప్లేయర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి ఆ బెస్ట్‌ ప్లేయర్‌ ఎవరో? అన్నది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Sanjay Manjrekar, Jasprit Bumrah, Virat Kohli, T20 World Cup 2024: టీమిండియాలో బెస్ట్‌ ప్లేయర్‌ అంటే అతనొక్కడే.. విరాట్‌ కోహ్లీ కూడా కాదు.. అంటూ భారత మాజీ ప్లేయర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి ఆ బెస్ట్‌ ప్లేయర్‌ ఎవరో? అన్నది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా రెండు విజయాలు సాధించింది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై, ఆ తర్వాత పాకిస్థాన్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో గ్రూప్‌-ఏలో తొలి స్థానంలో నిలిచింది. మరో విజయం సాధిస్తే.. రోహిత్‌ సేన సూపర్‌ 8కు అర్హత సాధిస్తుంది. ఈ నెల 12న యూఎస్‌ఏతో, అలాగే 15న కెనడాతో టీమిండియా గ్రూప్‌ దశలో మిగిలిన రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అయితే.. పాకిస్థాన్‌పై టీమిండియా సాధించిన విజయం తర్వాత కొంతమంది విరాట్‌ కోహ్లీ టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కోహ్లీని తిట్టేందుకే జట్టులోని మరో ఆటగాడిని హైలెట్‌ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిలో టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రస్తుతం కామెంటర్‌గా చేస్తున్న సంజయ్‌ మంజ్రేకర్‌ ఒకరు.

విరాట్‌ కోహ్లీని మీడియా హైప్‌ చేస్తుంటే.. టీమిండియాను జస్ప్రీత్‌ బుమ్రా గెలిపిస్తున్నాడని మంజ్రేకర్‌ అన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న అత్యుత్తమ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. మంబ్రేకర్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై క్రికెట్‌ అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. టీమిండియాలో బుమ్రా గొప్ప ఆటగాడు దాన్ని ఎవరు కాదనలేని విషయం. అయితే.. బుమ్రాను పొగిడేందుకు మంజ్రేకర్‌ కోహ్లీ పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్థం కావడంలేదని, కేవలం ఆయన వ్యాఖ్యలకు పబ్లిసిటీ కోసమే కోహ్లీ పేరు ప్రస్తావిస్తున్నారంటూ చాలా మంది క్రికెట్‌ ఫ్యాన్స్‌ మంజ్రేకర్‌కు చుకలు అంటిస్తున్నారు.

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ 4 పరుగులు మాత్రమే చేసి అవుటైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఫెయిల్‌ అయ్యాడు. దాన్ని ఎవరు కాదనడం లేదు. కానీ, కోహ్లీతో పాటే రోహిత్‌ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా లాంటి సీనియర్‌ బ్యాటర్లు కూడా విఫలం అయ్యారు. పాక్‌ టీమ్‌లోని బ్యాటర్లంతా విఫలం అయ్యారు. న్యూయార్క్‌ పిచ్‌ బౌలర్లకు అనుకూలంగా వ్యవహరించింది.. అక్కడ రెండు జట్లలోని బౌలర్ల మధ్య యుద్ధం జరిగింది. అత్యుత్తమ బౌలర్‌గా బుమ్రా తన సత్తాచాటి టీమిండియాను గెలిపించాడు. అయినా కోహ్లీ ఫెల్యూర్‌ గురించి మంజ్రేకర్‌ మాట్లాడుతున్నాడు కానీ, కోహ్లీ ఏం సాధించిన ఇంత స్టార్‌ డమ్‌ సంపాదించాడో, దేశం కోసం ఎన్ని గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడో ఒక మాజీ క్రికెటర్‌గా మంజ్రేకర్‌కు తెలియదా? అంటూ క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments