టీ20 వరల్డ్‌ కప్‌ ముందు రోహిత్‌కు వార్నింగ్‌ ఇచ్చిన భారత మాజీ క్రికెటర్‌!

Sanjay Manjrekar, Rohit Sharma, Hardik Pandya: టీ20 వరల్డ్‌ కప్‌ ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఓ మాజీ క్రికెటర్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. మరి ఆ వార్నింగ్‌ ఏంటి? ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు చూద్దాం..

Sanjay Manjrekar, Rohit Sharma, Hardik Pandya: టీ20 వరల్డ్‌ కప్‌ ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఓ మాజీ క్రికెటర్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. మరి ఆ వార్నింగ్‌ ఏంటి? ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం టీమిండియా ఫోకస్‌ మొత్తం టీ20 వరల్డ్‌ కప్‌ 2024 పైనే ఉంది. జూన్‌ 2న మొదలు కానున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో జూన్‌ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా తమ వరల్డ్‌ కప్‌ వేటను మొదలుపెట్టనుంది. అయితే.. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు భారత మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు వార్నింగ్‌ ఇచ్చాడు. అది కూడా టీమిండియాలోని ఓ స్టార్‌ ప్లేయర్‌ గురించి ప్రస్తావిస్తూ.. రోహిత్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. ఇంతకీ మంజ్రేకర్‌ ఏం అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిలో సమ బలంగా ఉంది. పైగా విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా లాంటి స్టార్‌ ప్లేయర్లు మంచి ఫామ్‌లో ఉండటంతో టీమిండియానే ఈ టోర్నీలో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. అయితే.. మంజ్రేకర్‌ మాత్రం హార్ధిక్‌ పాండ్యా విషయంలో ఆందోళన వ్యక్తం చేశాడు. ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఎంపిక చేసే సమయంలో హార్ధిక్‌ పాండ్యాను ఐదో బౌలర్‌గా పరిగణించొద్దని, అలా చేసే టీమిండియా దెబ్బ తినడం ఖాయమంటూ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు వార్నింగ్‌ ఇచ్చాడు.

ఎందుకంటే.. ఐపీఎల్‌ 2024లో హార్ధిక్‌ పాండ్యా బ్యాటింగ్‌, బౌలంగ్‌లో పెద్దగా రాణించలేదని 14 మ్యాచ్‌ల్లో కేవలం 216 పరుగులు చేశాడు. అలాగే బౌలర్‌గా టోర్నీలోని తొలి భాగంగా దారుణంగా విఫలమైనా.. రెండో భాగంగాలో పర్వాలేదనిపించాడు. మొత్తంగా 14 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశారు. అందుకే.. బ్యాటింగ్‌ విషయంలో టీమిండియా హార్ధిక్‌ పాండ్యాపై పెద్దగా ఆధారపడకపోవచ్చు కానీ, ఐదో బౌలర్‌గా తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతుందని అన్నాడు. పాండ్యా బదులు టీమ్‌లో స్పిన్‌పై ఫోకస్‌ పెట్టాలని ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగినా నష్టం లేదని మంజ్రేకర్‌ అన్నాడు. మరి ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments