iDreamPost
android-app
ios-app

మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం వెనుక సచిన్‌ మెళకువలు! పాత వీడియో వైరల్‌

  • Author Soma Sekhar Updated - 09:24 PM, Wed - 8 November 23

కంగారూ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు మాక్స్ వెల్. అయితే అతడి విధ్వంసం వెనక క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ నేర్పిన మెళకువలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఆ వివరాల్లోకి వెళితే..

కంగారూ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు మాక్స్ వెల్. అయితే అతడి విధ్వంసం వెనక క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ నేర్పిన మెళకువలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఆ వివరాల్లోకి వెళితే..

  • Author Soma Sekhar Updated - 09:24 PM, Wed - 8 November 23
మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం వెనుక సచిన్‌ మెళకువలు! పాత వీడియో వైరల్‌

మాక్స్ వెల్ వరల్డ్ కప్ లో ప్రస్తుతం మారుమ్రోగిపోతున్న పేరు. ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అనూహ్యంగా చెలరేగి.. ఆసీస్ కు మరచిపోలేని విజయాన్ని అందించాడు. మాక్స్ వెల్ సునామీ ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ సెమీస్ కు దూసుకొచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ ఓటమి ఖాయమని జట్టు ఆటగాళ్లతో పాటుగా సగటు క్రికెట్ ప్రేమికులు కూడా అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా మాక్సీ చెలరేగి ద్విశతకం బాదాడు. కేవలం 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులతో అజేయంగా నిలిచి.. కంగారూ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అయితే మాక్స్ వెల్ విధ్వంసం వెనక క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ నేర్పిన మెళకువలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? తాజాగా సచిన్ నుంచి మాక్సీ బ్యాటింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటున్న పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది.

వరల్డ్ కప్ లో భాగంగా ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ సృష్టించిన సునామీ అంతాఇంతా కాదు. మాక్సీ పరుగుల తుపాన్ ధాటికి వాంఖడే స్టేడియం ఫోర్లు, సిక్సర్లతో తడిచిముద్దైంది. గ్రౌండ్ నలువైపులా మాక్స్ వెల్ కొట్టిన షాట్లు ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఇక ఓడిపోయే మ్యాచ్ ను కళ్లు చెదిరే రేంజ్ లో గెలిపించిన మ్యాక్సీపై వరల్డ్ వైడ్ గా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. ఈ మ్యాచ్ లో మాక్స్ వెల్ థండర్ ఇన్నింగ్స్ వెనక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఉన్నాడని ఎంతమందికి తెలుసు? అవును సచిన్ నుంచి అతడు టెక్నిక్స్ నేర్చుకుంటున్న పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

ఆ వీడియోలో సచిన్ ముందుండి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. అతడి వెనకాలే మాక్స్ వెల్ సేమ్ సచిన్ ఎలా షాట్స్ ఆడుతున్నాడో అలాగే ప్రాక్టీస్ చేస్తున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ ఎలా ఆడుతున్నాడు, అతడు ఎలాంటి టెక్నిక్స్ ను బ్యాటింగ్ లో ఉపయోగిస్తున్నాడో దగ్గరుండి మరీ నేర్చుకున్నాడు మ్యాక్సీ. కాగా.. 2013లో మాక్స్ వెల్ ఐపీఎల్ మెగాటోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ టైమ్ లో సచిన్ నుంచి ఎన్నో మెళకువలను నేర్చుకున్నాడు మాక్సీ. ఆ తర్వాత పంజాబ్ కు ఆడిన అతడు చెలరేగడం మనకు తెలిసిన విషయమే. తాజాగా మాక్స్ వెల్ సృష్టించిన విధ్వంసం తర్వాత ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి కంగారూ స్టార్ ఆల్ రౌండర్ తుపాన్ ఇన్నింగ్స్ వెనక మాస్టర్ బ్లాస్టర్ నేర్పిన టెక్నిక్స్ ఉండటం మీకేవిధంగా అనిపించిందో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap