iDreamPost
android-app
ios-app

మాక్స్ వెల్ కు చుక్కలు చూపించిన గైక్వాడ్! ఒక్క ఓవర్ లోనే…

  • Published Nov 28, 2023 | 9:39 PM Updated Updated Nov 28, 2023 | 9:39 PM

మాక్స్ వెల్ బౌలింగ్ లో ఒక్క ఓవర్ లోనే 30 రన్స్ సాధించిన రుతురాజ్. ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 57 బంతుల్లోనే 13 ఫోర్లు, 7 సిక్సులు బాది 123 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

మాక్స్ వెల్ బౌలింగ్ లో ఒక్క ఓవర్ లోనే 30 రన్స్ సాధించిన రుతురాజ్. ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 57 బంతుల్లోనే 13 ఫోర్లు, 7 సిక్సులు బాది 123 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

  • Published Nov 28, 2023 | 9:39 PMUpdated Nov 28, 2023 | 9:39 PM
మాక్స్ వెల్ కు చుక్కలు చూపించిన గైక్వాడ్! ఒక్క ఓవర్ లోనే…

ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య బర్సపరా స్టేడియం వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్ లలో ఆసిస్ ను చావుదెబ్బ కొట్టిన టీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. సిరీస్ ను కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో భారత్ యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ వీర విధ్వంసం సృష్టించాడు. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు రుతురాజ్ గైక్వాడ్. కాగా ఆసిస్ దిగ్గజ ప్లేయర్ మ్యాక్స్ వెల్ బౌలింగ్ ను ఉతికారేసాడు. ఏకంగా మ్యాక్సి వేసిన ఒక్క ఓవర్లోనే 30 పరుగులు పిండుకున్నాడు.

మూడో టీ20లో భారత్ అదరగొడుతోంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా ఆసిస్ కు చెమటలు పట్టిస్తోంది. వరల్డ్ కప్ చేదు నిజాలను మైమరపిస్తూ వరుస విజయాలతో విజయ ఢంకా మోగిస్తోంది. ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ తన బ్యాటును ఝళిపించాడు. కేవలం 57 బంతుల్లోనే 13 ఫోర్లు, 7 సిక్సులు బాది 123 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ మ్యాక్స్ వెల్ కు చుక్కలు చూపించాడు. అతడు వేసిన 19 ఓవరల్లో ఏకంగా 30 పరుగులను రాబట్టాడు. ఆ ఓవర్ 1 బాల్ కు సిక్స్ కొట్టాడు గైక్వాడ్. రెండో బాల్ నోబాల్ కాగా ఫోర్ వచ్చింది. నాలుగో బంతి వైడ్, ఆ తర్వాతి బంతికి సిక్స్ కొట్టాడు. ఐదో బంతికి మళ్లీ సిక్స్ బాదాడు. 19 వ ఓవర్ లాస్ట్ బాల్ కు ఫోర్ కొట్టి 30 పరుగులు రాబట్టి మ్యాక్స్ వెల్ బౌలింగ్ ను చీల్చి చెండాడాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet