iDreamPost
android-app
ios-app

ఆ టీమిండియా క్రికెటర్​కు నేను ఫ్యాన్​ని.. అతడో రాక్షసుడు: హాలీవుడ్ హీరో​

  • Published Jul 05, 2024 | 4:59 PM Updated Updated Jul 05, 2024 | 4:59 PM

Team India: ఓ టీమిండియా క్రికెటర్​పై ఒక హాలీవుడ్ హీరో ప్రశంసలు కురిపించాడు. అతడు మామూలు ప్లేయర్ కాదని.. అతడో బీస్ట్ అంటూ మెచ్చుకున్నాడు.

Team India: ఓ టీమిండియా క్రికెటర్​పై ఒక హాలీవుడ్ హీరో ప్రశంసలు కురిపించాడు. అతడు మామూలు ప్లేయర్ కాదని.. అతడో బీస్ట్ అంటూ మెచ్చుకున్నాడు.

  • Published Jul 05, 2024 | 4:59 PMUpdated Jul 05, 2024 | 4:59 PM
ఆ టీమిండియా క్రికెటర్​కు నేను ఫ్యాన్​ని.. అతడో రాక్షసుడు: హాలీవుడ్ హీరో​

టీమిండియా క్రికెటర్లు ఇప్పుడు ఫుల్ జోష్​లో ఉన్నారు. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ కప్​ను నెగ్గడంతో వాళ్లు సంతోషంలో మునిగిపోయారు. పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి పటిష్టమైన టీమ్స్​ను చిత్తు చేసి విశ్వవిజేతగా ఆవిర్భవించడంతో భారత అభిమానులు కూడా సంబురాలు చేసుకుంటున్నారు. కప్ గెలిచిన దగ్గర నుంచి ఇప్పటిదాకా సెలబ్రేషన్స్ రోజురోజుకీ మరింత ఊపందుకుంటున్నాయి. నిన్న ముంబైలో టీమిండియా విక్టరీ పరేడ్ నిర్వహించింది. ట్రోఫీ చేతబట్టి ముంబైలో దిగిన రోహిత్ సేనకు లక్షలాది మంది అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఎయిర్​పోర్ట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు భారత ఆటగాళ్ల బస్సుకు జనసంద్రం నుంచి విశేషమైన స్పందన లభించింది.

ఆటగాళ్లను చూసి పరవశంలో మునిగిపోయారు అభిమానులు. జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత వాంఖడేలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో టీమిండియా పాల్గొంది. అక్కడ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ విక్టరీ స్పీచ్ ఇచ్చారు. అనంతరం పలు హిట్ సాంగ్స్​కు డ్యాన్సులు చేస్తూ ఫ్యాన్స్​లో మరింత జోష్ నింపారు. ఇదిలా ఉంటే.. టీమిండియా వరల్డ్ కప్ గెలవడంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు భారత జట్టు సాధించిన విజయాన్ని కొనియాడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో ఓ హాలీవుడ్ హీరో చేరారు. ప్రముఖ నటుడు హో జాక్​మన్​ టీమిండియా సక్సెస్​పై రియాక్ట్ అయ్యారు. రోహిత్ సేన అద్భుత విజయం సాధించిందని మెచ్చుకున్నారు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మకు తాను బిగ్ ఫ్యాన్​నని.. అతడు అంటే తనకు పిచ్చి అని రివీల్ చేశారు జాక్​మన్. అతడి బ్యాటింగ్ నెక్స్ట్ లెవల్​లో ఉంటుందన్నారు. అతడో రాక్షసుడు అంటూ హిట్​మ్యాన్​ను ప్రశంసల్లో ముంచెత్తారు. తాను క్రికెట్​ ఎక్కువగా చూస్తుంటానని తెలిపారు. టీమిండియాలో రోహిత్ తన ఫేవరెట్ క్రికెటర్ అని బయటపెట్టారీ హాలీవుడ్ హీరో. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ హాలీవుడ్ హీరో రోహిత్​ బ్యాటింగ్​కు ఫ్యాన్​నని చెప్పడంతో హిట్​మ్యాన్ అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ఇది అతడి క్రేజ్​కు నిదర్శనమని అంటున్నారు. ఇక, హిట్​మ్యాన్​ను ప్రశంసల్లో ముంచెత్తిన జాక్​మన్ పలు సినిమాల ద్వారా ఇండియన్ మూవీ లవర్స్​కు చేరువయ్యారు. ‘ఎక్స్​ మెన్’, ‘లోగాన్’, ‘ది ప్రెస్టీజ్’, ‘ప్రిజనర్స్’, ‘ది వాల్వరిన్’, ‘ది ఫౌంటెయిన్’ ఫిల్మ్స్​తో ఆయన ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. మరి.. రోహిత్​ను హాలీవుడ్ హీరో మెచ్చుకోవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet