వరల్డ్ కప్‌లో టీమిండియాను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అలాంటి హిట్‌మ్యాన్‌పై మాజీ క్రికెటర్ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక విషయంలో అతడు అందర్నీ భయపెడుతున్నాడని అన్నాడు.
వరల్డ్ కప్‌లో టీమిండియాను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అలాంటి హిట్‌మ్యాన్‌పై మాజీ క్రికెటర్ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక విషయంలో అతడు అందర్నీ భయపెడుతున్నాడని అన్నాడు.
వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ ఫుల్ జోష్‌లో ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ఫేవరెట్స్‌తో పాటు పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి డేంజరస్ టీమ్స్‌ను కూడా చిత్తు చేసింది రోహిత్ సేన. ఆడిన ఐదు మ్యాచుల్లోనూ నెగ్గిన భారత్.. వరల్డ్ కప్ పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేసులో ఉంది. కివీస్‌తో మ్యాచ్ తర్వాత గ్యాప్ దొరకడంతో ప్లేయర్లు రెస్ట్ తీసుకున్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు మరింత ఫ్రెష్‌గా, ప్రిపేర్డ్‌గా ఉండేందుకు ఇది హెల్ప్ అయింది. భారత ప్లేయర్స్‌తో పాటు కోచింగ్ స్టాఫ్ కూడా ధర్మశాలలో ఉండి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట్ హల్చల్ చేశాయి.
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో గెలుపుపై ఫోకస్ పెట్టాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ వరల్డ్ కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు హిట్‌మ్యాన్. బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తూ యంగ్‌స్టర్స్‌కు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఫీల్డ్‌లో బౌలర్లకు అవసరమైన టైమ్‌లో సలహాలు, సూచనలు ఇస్తూ కెప్టెన్‌గా సపోర్ట్‌గా ఉంటున్నాడు. మెగా టోర్నీలో బ్యాటింగ్, కెప్టెన్సీలో ఫుల్ మార్క్స్ వేయించుకున్న రోహిత్.. ఇదే జోరును కొనసాగిస్తే భారత్ ఖాతాలో మరో ప్రపంచ కప్ వచ్చి చేరడం ఖాయంలా కనిపిస్తోంది. టీమిండియాను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్న రోహిత్‌ను సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ప్రశంసల్లో ముంచెత్తాడు.
‘రోహిత్ భారత్‌కు శుభారంభాలు అందిస్తున్నాడు. అలవోకగా సిక్సులు బాదే అతడి సామర్థ్యం అద్భుతం. బౌలర్ల నుంచి రెస్పెక్ట్ను అతడు డిమాండ్ చేస్తాడు. మెగా టోర్నీలో బ్యాటింగ్ విషయంలో అతడు ప్రత్యర్థి జట్లను భయపెడుతున్నాడు. ఆసీస్ దిగ్గజం మ్యాథ్యూ హేడెన్‌ను హిట్‌మ్యాన్ గుర్తు చేస్తున్నాడు. హేడెన్లాగే రోహిత్ కూడా క్రీజులో నిలబడి బాల్‌ను గట్టిగా బాదుతున్నాడు. రోహిత్ ఆరంభంలో ఫాస్ట్‌గా ఆడుతూ టీమ్‌కు మంచి ఓపెనింగ్ ఇస్తున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో అతడి బ్యాటింగ్ సూపర్బ్‌గా ఉంది. కెప్టెన్‌గా ఐపీఎల్లో ముంబైను రోహిత్ ఎంత బాగా నడిపించాడో చూశాం. ఇప్పుడు వరల్డ్ కప్‌లో కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఈసారి కప్పును టీమిండియా గెలుచుకోవడం ఖాయం’ అని డివిలియర్స్ జోస్యం చెప్పాడు. మరి.. రోహిత్‌ను ఉద్దేశించి ఏబీడీ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రోహిత్, కోహ్లీ కాదు.. వరల్డ్ కప్‌లో అందర్నీ భయపెట్టిస్తున్న బ్యాటర్ అతనే!
AB Devilliers said “Rohit Sharma is giving a great start for India – he is fantastic, the six hitting ability of him shows what kind of aura he has, he demands respect from bowlers – it’s very intimidating for the opposition in the rest of the tournament”. [AB YT] pic.twitter.com/ArQ7PmeGFc
— Johns. (@CricCrazyJohns) October 25, 2023