SNP
వరల్డ్ కప్ వేటలో కోహ్లీ, రోహిత్, రాహుల్ సూపర్ ఫామ్ లో ఉండటం, మరోవైపు బౌలింగ్ లో కుల్దీప్, సిరాజ్, బుమ్రా దుమ్ములేపుతుండటం ఇండియాకి బాగా కలిసొస్తుంది. ఈ సక్సెస్‌ఫుల్ విక్టరీల్లో అందరి భాగస్వామ్యం ఉన్నా.. ఒక్కడి పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. అతనెవరో.. జట్టు కోసం ఏం చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
వరల్డ్ కప్ వేటలో కోహ్లీ, రోహిత్, రాహుల్ సూపర్ ఫామ్ లో ఉండటం, మరోవైపు బౌలింగ్ లో కుల్దీప్, సిరాజ్, బుమ్రా దుమ్ములేపుతుండటం ఇండియాకి బాగా కలిసొస్తుంది. ఈ సక్సెస్‌ఫుల్ విక్టరీల్లో అందరి భాగస్వామ్యం ఉన్నా.. ఒక్కడి పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. అతనెవరో.. జట్టు కోసం ఏం చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఇండియన్ క్రికెట్ టీమ్ గత 2 ఏళ్ళ నుండి వరల్డ్ కప్ కోసం చాలా వ్యూహాలే రచించింది. ఈ మెగా టోర్నీ కోసం ఆటగాళ్లు చాలానే సవాళ్లు దాటి వచ్చారు. అందుకు తగ్గట్టే టీమ్ కూడా అద్భుతంగా కుదిరింది. ఇంత ప్లానింగ్ జరిగింది కాబట్టే.. ఇప్పుడు టోర్నీలో టీమిండియా అపజయం లేకుండా ముందుకి దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచుల్లోనూ గెలిచిన రోహిత్ సేన చాలా పటిష్టంగా కనిపిస్తోంది. కోహ్లీ, రోహిత్, రాహుల్ సూపర్ ఫామ్ లో ఉండటం, మరోవైపు బౌలింగ్ లో కుల్దీప్, సిరాజ్, బుమ్రా దుమ్ములేపుతుండటం ఇండియాకి బాగా కలిసొస్తుంది. అయితే.. ఈ జైత్రయాత్రలో అందరి భాగస్వామ్యం ఉన్నా.. ఒక్కడి పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. అతనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.
రోహిత్ శర్మ కేవలం మంచి ఫామ్ లో ఉండటం, ఎక్కువ పరుగులు చేస్తుండటం వల్ల మాత్రమే ప్రత్యేకం కాదు. అలా అయితే కోహ్లీ ఈ విషయంలో శర్మ కన్నా ముందు ఉన్నాడు. కానీ.., ఇక్కడ హిట్ మ్యాన్ తన ప్రత్యేకతని చాటుకున్నాడు. రోహిత్ పరుగులు సాధిస్తున్న వేగం టీమిండియా విజయాలకు కీలకంగా మారింది. ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 311 పరుగులు సాధించి.., కోహ్లీ తరువాత రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి మ్యాచ్ లో డకౌట్ అయిన రోహిత్.. మిగతా మ్యాచ్ ల్లో వరుసగా 131, 86, 48, 46 పరుగులు సాధించాడు. ఇవన్నీ కూడా తక్కువ బంతుల్లో.. ఎక్కువ స్ట్రైక్ రేట్ తో సాధించిన పరుగులు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుండే హిట్ మ్యాన్ ఊచకోత మొదలు పెట్టేస్తున్నాడు. ఆయా జట్ల స్ట్రైక్ బౌలర్లును అలవోకగా సిక్స్ లు కొడుతూ.. వారి బౌలింగ్ లో లయ దెబ్బ తీస్తున్నాడు. ప్రత్యర్ధుల ప్లాన్స్ అన్నీ బ్రేక్ చేస్తూ.. వారిని ఒక డిఫెన్సివ్ మోడ్ లోకి నెట్టేస్తున్నాడు.
ఇండియా ఇప్పటి వరకు ఆడిన అన్నీ మ్యాచ్ ల్లో అన్నీ చేజింగ్స్ చేసింది. ఇక్కడ రోహిత్ వేగంగా బ్యాటింగ్ చేస్తుండటంతో మిడిల్ ఆర్డర్ పై వేగంగా ఆడాలన్న భారం తగ్గిపోయింది. కోహ్లీ, అయ్యర్, రాహుల్ వంటి బ్యాటర్స్ కి సెటిల్ కావడానికి అవకాశం దొరుకుతుంది. న్యూజిలాండ్ తో మ్యాచ్ అనంతరం రాహుల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం విశేషం. ముందు ఉండి నడిపించే వాడిని నాయకుడు అంటారు. రోహిత్ ఆట ఇప్పుడు అచ్చం ఇలానే ఉంది. తన వ్యక్తిగత రికార్డ్స్ పట్టించుకోకుండా, టీమ్ కోసం ఆడుతూ.., మిగతా ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా చేస్తూ.. రోహిత్ శర్మ శబాష్ అనిపించుకుంటున్నాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇలానే.. తాను ఫాస్ట్ గా ఆడుతూ.. మిగిలిన ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించేవాడు. తాడో పేడో తేల్చుకోవాల్సిన వరల్డ్ కప్ టోర్నీలో రోహిత్ కూడా ఇలాంటి పంథాని ఎంచుకోవడం గొప్ప విషయం. మరి.. వేగంగా పరుగులు చేస్తూ.., టీమిండియా వరుస విజయాలకు కారణం అవుతున్న రోహిత్.. మనకి వరల్డ్ కప్ సాధించి పెడుతాడా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rohit Sharma shared a picture with Virat Kohli and KL Rahul after a victory against Bangladesh in the CWC 2023.
This trio of the Indian team🔥❤️ pic.twitter.com/VFbqgiy2BX
— CricTracker (@Cricketracker) October 20, 2023
ఇదీ చదవండి: World Cup: రనౌట్ విషయంలో సూర్య చేసింది.. త్యాగమా? తప్పా?