Rohit Sharma: రోహిత్ టీ20 కెప్టెన్సీపై క్లారిటీ .. ఆ సిరీస్ నుంచే..!

రోహిత్ శర్మ టీ20 కెప్టెన్సీ పై క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

రోహిత్ శర్మ టీ20 కెప్టెన్సీ పై క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. తొలి మ్యాచ్ లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక చివరిదైన రెండో పోరు కేప్ టౌన్ వేదికగా జనవరి 3(బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్టులో నెగ్గి ఎలాగైనా సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది భారత జట్టు. ఇక ఈ టూర్ ముగిసిన వెంటనే ఆఫ్గానిస్తాన్ తో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు ముందు నుంచి పాండ్యానే కెప్టెన్ గా వ్యవహరిస్తాడు అంటూ బీసీసీఐ వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హార్దిక్ పాండ్యా గాయం నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో రోహిత్ శర్మనే ఆఫ్గాన్ టీ20 సిరీస్ కు కెప్టెన్ గా ఉండమని బీసీసీఐ కోరిందట. రోహిత్ శర్మ టీ20 కెప్టెన్సీపై పూర్తి వివరాల్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే పాండ్యా గాయం నుంచి కోలుకుంటాడని ఆఫ్గానిస్తాన్ తో జరిగే టీ20 సిరీస్ కు అందుబాటులో ఉంటాడని అతడిని కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పాండ్యా గాయం నుంచి రికవరీ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఆఫ్గానిస్తాన్ తో జరిగే పొట్టి సిరీస్ కు రోహిత్ శర్మనే కెప్టెన్ గా వ్యవహరించాలని కోరిందట బీసీసీఐ. దానికి హిట్ మ్యాన్ కూడా అంగీకరించాడని తెలుస్తోంది.

కాగా.. వచ్చే టీ20 వరల్డ్ కప్ కు కూడా రోహిత్ శర్మనే సారథిగా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికి రోహిత్ సైతం సుముఖంగా ఉన్నాడని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారడంతో.. హిట్ మ్యాన్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే వస్తుందని సమాచారం. ఇదిలా ఉండగా.. కేప్ టౌన్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ కోసం టీమిండియా కఠోర సాధన చేసింది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి.. సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది. మరి టీ20 కెప్టెన్ గా మళ్లీ రోహిత్ శర్మను నియమిస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments