బంగ్లాదేశ్‌ కోసం అదిరిపోయే ప్లాన్‌ వేసిన రోహిత్‌ శర్మ! చెపాక్‌లో చెడుగుడే..

Rohit Sharma, Ravichandran Ashwin, Ravindra Jadeja, Kuldeep Yadav, IND vs BAN: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్లాన్స్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు బంగ్లాతో ప్రారంభం కానున్న తొలి టెస్ట్‌ కోసం కూడా సూపర్‌ ప్లాన్‌తో వస్తున్నాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుం‍దాం..

Rohit Sharma, Ravichandran Ashwin, Ravindra Jadeja, Kuldeep Yadav, IND vs BAN: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్లాన్స్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు బంగ్లాతో ప్రారంభం కానున్న తొలి టెస్ట్‌ కోసం కూడా సూపర్‌ ప్లాన్‌తో వస్తున్నాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుం‍దాం..

చాలా గ్యాప్‌ తర్వాత టీమిండియా టెస్ట్‌ సమరానికి సిద్ధమవుతోంది. టీ20 వరల్డ్‌ కప్‌ విజయంతో వచ్చిన సంతోషం, శ్రీలంకపై వన్డే సిరీస్‌ ఓటమి వల్ల కలిగిన బాధను మర్చిపోయి.. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ బరిలోకి దిగనుంది రోహిత్‌ సేన. ఈ నెల 19 నుంచి భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్‌ సిరీస్‌లో బంగ్లాదేశ్‌పై పైచేయి సాధించడానికి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సూపర్‌ ప్లాన్‌ వేసినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌ను టెస్టుల్లో ఓడించేందుకు ప్రత్యేక ప్లాన్లు అవసరమా? అంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమే అంటున్నారు క్రికెట్‌ పండితులు.

ఇటీవలె పాకిస్థాన్‌ను వాళ్ల దేశంలోనే వరుసగా రెండు టెస్టులు ఓడించి.. సిరీస్‌ను వైట్‌వాష్‌ చేసింది బంగ్లా టీమ్‌. పైగా తొలి టెస్టు జరిగేది చెన్నైలోని చిదంబరం స్టేడియంలో. చెన్నై పిచ్‌ స్పిన్‌కు స్వర్గధామంగా ఉంటుంది. ఇక్కడ లభించే టర్న్‌తో స్పిన్నర్లు చెలరేగిపోతుంటారు. బంగ్లాదేశ్‌ ప్రధన బలం కూడా స్పిన్‌ బౌలింగే. టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ ముందు వాళ్ల స్పిన్‌ బలం పెద్ద విషయం కాకపోయినా.. మరీ అంత తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. అందుకే.. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెతను రోహిత్‌ శర్మ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు ఇన్‌సైడ్‌ టాక్‌. సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, చైనామెన్‌ కుల్దీప్‌ యాదవ్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాలను తుది జట్టులోకి తీసుకొని.. బంగ్లా బ్యాటింగ్‌ లైనప్‌ను స్పిన్‌ను అతలాకుతలం చేయాలని రోహిత్‌ ఫిక్స్‌ అయిపోయినట్లు తెలుస్తోంది. గురువారం ప్రారంభం కాబోయే తొలి టెస్టు ప్లేయింగ్‌ ఎలెవన్‌పై ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నట్లు సమాచారం. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు క్వాలిటీ పేసర్లతో బరిలోకి దిగనుంది భారత జట్టు. మరి బంగ్లాదేశ్‌పై తొలి టెస్ట్‌లో టీమిండియా స్పిన్‌ త్రిమూర్తులు అశ్విన్‌, కుల్దీప్‌, జడేజాతో ఎటాక్‌ చేయబోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments