అమెరికాలో కొత్త బిజినెస్‌ ప్రారంభించిన రోహిత్‌ శర్మ

మనదేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. క్రికెట్‌ను ఓ ఆటలా కాకుండా ఓ మతంలా ఆరాధిస్తారనే నానుడి ఉంది. చాలా వరకు అదే నిజం. అలాగే మరికొన్ని దేశాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంది. కానీ ప్రపంచంలో చాలా దేశాల్లో క్రికెట్‌ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. అమెరికా లాంటి అగ్రరాజ్యంలోనూ ఇప్పుడిప్పుడే క్రికెట్‌కు ఆదరణ లభిస్తోంది. తాజాగా అమెరికాలో మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీని నిర్వహించారు. అది సూపర్‌ సక్సెస్‌ అయింది. ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజ్‌ తొలి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇలా అమెరికాలో క్రికెట్‌ విస్తరిస్తోంది.

ఈ క్రమంలోనే యూఎస్‌ఏలో కూడా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు అవుతున్నాయి. ఇదే వరుసలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన అకాడమీని అమెరికాలో ప్రారంభించాడు. కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన క్రికింగ్‌డమ్ పేరుతో దీన్ని మొదలు పెట్టాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత పాపులర్ ప్లేయర్లలో రోహిత్ శర్మ ఒకడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే.. ఇప్పటికే భారత్‌లో క్రికింగ్‌డమ్ చాలా పాపులర్ క్రికెట్‌ అకాడమీ. దేశవ్యాప్తంగా దీనికి పలు బ్రాంచ్‌లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది అమెరికాలోని యంగ్ క్రికెటర్లకు ఈ అకాడమీ క్రికెట్‌ పాఠాలు నేర్పుతోంది.

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ గ్రాండ్ సక్సెస్ కావడంతో అమెరికాలో యువత క్రికెట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని క్యాష్‌ చేసుకుందామని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చూస్తున్నాడు. ఇక్కడ రోహిత్ తన అకాడమీని మొదలు పెట్టాడు. కాలిఫోర్నియాలో ఇలా రోహిత్ తన అకాడమీ ప్రారంభించిన విషయాన్ని హిట్‌మ్యాన్ బిజినెస్ పార్టనర్ చేతన్ సూర్యవంశీ వెల్లడించాడు. రోహిత్, ఇతర భాగస్వాములతో కలిసిన ఒక ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రోహిత్ శర్మకు చెందిన క్రికింగ్‌డమ్ క్రికెట్ అకాడమీ.. ప్రీలాంచ్ సెలబ్రేషన్స్’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ పెట్టాడు. దీంతో రోహిత్‌ క్రికెట్‌ అకాడమీ అమెరికాలో సేవలు అందించనుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఈ ప్రపంచ కప్‌ పాకిస్థాన్‌దే! టీమిండియాకు అంత సీన్‌ లేదు: దిగ్గజ క్రికెటర్‌

Show comments