SNP
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో రోహిత్‌సేన ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఫీల్డ్ అంపైర్‌తో గొడవకు దిగాడు. ఒక అవుట్ విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో రోహిత్‌సేన ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఫీల్డ్ అంపైర్‌తో గొడవకు దిగాడు. ఒక అవుట్ విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 399 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను అశ్విన్, బుమ్రా చెలరేగి.. కేవలం 292 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో.. భారత జట్టు 106 పరుగుల తేడా గెలుపొందింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ను రెండు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత 1-1తో సమం చేసింది రోహిత్ సేన. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో టెస్టులో టీమిండియా గెలిచి.. లెక్క సరిచేసింది. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌లు ఈ నెల 15 నుంచి మార్చ్ 11 వరకు జరగనున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. అంపైర్‌పై సీరియస్ అయ్యాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..
అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 63వ ఓవర్ ఐదో బంతిని ఇంగ్లండ్ బ్యాటర్ టామ్ హార్ట్లీ రివర్స్ స్విప్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, బాల్ చేతికి తగిలి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. టీమిండియా ఆటగాళ్లు అపీల్ చేయడంతో అంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ, హార్ట్లీ రివ్యూ తీసుకోవడంతో.. బాల్ బ్యాట్‌కి కాని, గ్లౌజ్‌కి కాని తాకకపోవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే.. క్యాచ్ అవుట్ కాకపోయినా.. బాల్ బ్యాట్‌కి తాకలేదు కనుక.. లెగ్ బిఫోర్ అవుట్ కోసం థర్డ్ అంపైర్ చెక్ చేశాడు. అవుట్‌కు అన్ని సరిగ్గా సరిపోయినా.. అంపైర్స్ కాల్‌లో నాటౌట్ ఉండటంతో.. లెగ్ బిఫోర్ అవుట్ నుంచి బ్యాటర్ తప్పించుకున్నాడు. దీంతో.. థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే.. ఇక్కడే రోహిత్ శర్మకు చిర్రెత్తుకొచ్చింది. ఏం అంపైరింగ్ చేస్తున్నారంటూ మండిపడ్డాడు.
ఎల్బీడబ్ల్యూలో అంపైర్స్ కాల్‌లో నాటౌట్ ఉందేంటి.. నువ్వు అవుట్ ఇచ్చావ్‌గా? అయినా ఎందుకు బ్యాటర్‌ను నాటౌట్‌గా ప్రకటించారు అని అంపైర్‌తో రోహిత్ వాగ్వాదానికి దిగాడు. ఈ డిస్క్రషన్ చాలా సేపే సాగింది. అయితే.. తాను అవుట్ ఇచ్చింది క్యాచ్ అవుట్ కోసమని, ఎల్బీడబ్ల్యూ కోసం కాదని, అందుకే థర్డ్ అంపైర్ అంపైర్స్ కాల్ నాటౌట్ చూపిస్తూ.. అతన్ని నాటౌట్‌గా ప్రకటించాడని వివరించాడు. డీఆర్‌ఎస్‌లో ఇలాంటి వింత పరిస్థితి రావడంతో ఇదే మొదటి సారి అంటూ రోహిత్ శర్మకు.. ఫీల్డ్ అంపైర్ నచ్చజెప్పడంతో రోహిత్.. అసంతృప్తిగానే వాదనను ముగించి.. ఫీల్డింగ్‌కి వెళ్లిపోయాడు. అవుట్ నుంచి బతికిపోయిన హార్ట్లీ కొంతసేపటి అవుట్ అయ్యాడు. బుమ్రా అతన్ని క్లీన్ బౌల్డ్ చేయడంతో టీమిండియాను విజయం వరించింది. మరి ఈ మ్యాచ్‌లో తలెత్తిన ఈ వింత పరిస్థితితో పాటు, అంపైర్‌పై రోహిత్ శర్మ సీరియస్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
– Tom Hartley given out for catch out.
– No inside edge, ball hits Harley’s arm.
– 3rd umpire does Hand Before Wicket, turns out the umpire’s call.– Hartley given NOT OUT…!!! pic.twitter.com/ejDIo3S8ke
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 5, 2024
“After giving the final dismissal, how did Tom Hartley manage to remain not out? 🧐🧐#TomHartley #rohitsharma #RavichandranAshwin #ENGvIND #cricketlovers pic.twitter.com/CJxz8gqLqr
— CricInformer (@CricInformer) February 5, 2024
Rohit Sharma was clearly not happy with the DRS decision.
📸: JioCinema#RohitSharma #TomHartley #RavichandranAshwin #INDvENG #IndianCricketTeam #EnglandCricket #CricketTwitter pic.twitter.com/nhGHEFPWek
— InsideSport (@InsideSportIND) February 5, 2024