Rohit Sharma: నేను కూడా అన్ని సెంచరీలు చేశా.. కానీ, ఎవడికి ఉపయోగం: రోహిత్‌ శర్మ

Rohit Sharma: భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన సెంచరీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు ఆ సెంచరీలతో ఏం చేసుకోవాలని ఒక అన్నాడు. ప్రస్తుతం చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అసలు రోహిత్‌ ఇలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma: భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన సెంచరీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు ఆ సెంచరీలతో ఏం చేసుకోవాలని ఒక అన్నాడు. ప్రస్తుతం చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అసలు రోహిత్‌ ఇలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ సెంచరీల విషయంలో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆరంభానికి ముందుకు రోహిత్‌ చేసిన ఈ కామెంట్స్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్ట్‌ జరుగుతోంది. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భారత స్పిన్నర్లు ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు. మ్యాచ్‌ సంగతి పక్కనపెడితే.. మ్యాచ్‌కి ముందు రోహిత్‌ తన సెంచరీలు గురించి వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిస్తే.. జట్టు గెలవాలనే కసి రోహిత్‌లో ఏ రేంజ్‌లో ఉందో అర్థం అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్ట్‌ ప్రారంభానికి ముందు టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌.. రోహిత్‌ను ఇంటర్వ్యూ చేశాడు.

ఈ చిట్‌చాట్‌లో వరల్డ్‌ కప్‌ గెలవడం గురించి, వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో సెంచరీలు చేయడమనే అంశం గురించి టాపిక్‌ వచ్చింది. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ఎన్ని సెంచరీలు చేసి ఏం లాభం, కప్పు కొట్టడమే ముఖ్యం. 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో నేను ఏకంగా ఐదు సెంచరీలు చేశాడు. కానీ, అవన్ని వేస్ట్‌ అయిపోయాయని, వాటి గురించి ఎవరూ మాట్లాడుకోరని, ఛాంపియన్‌షిప్‌ గెలిచామా లేదా అన్నదే ముఖ్యమని’ రోహిత్‌ చెప్పుకొచ్చాడు. అయితే.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో కూడా రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లీ అద్భుతంగా రాణించినా టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలవలేకపోయింది. టోర్నీ మొత్తం జట్టులోని 11 మంది ఆటగాళ్లు అదరగొట్టినా ఫైనల్లో ఓటమితో కప్పు చేజారింది.

కాగా, రోహిత్‌ శర్మ ప్రస్తుతం సెంచరీలపై చేసిన కామెంట్స్‌ మాత్రం తెగ వైరల్‌ అవుతున్నాయి. రోహిత్‌ శర్మ దృష్టిలో సెంచరీలు చేయడం పెద్ద విషయం కాదని, టీమిండియాకు వరల్డ్‌ కప్‌ అందించడం లేదా, ఇతర మెగా టోర్నీలు గెలవడమే పెద్ద విషయని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. అందుకు వన్డే వరల్డ్‌ కప్‌ 2023నే మంచి ఉదాహరణ అని అంటున్నారు. ఎందుకంటే.. రోహిత్‌ శర్మ వరల్డ్‌ కప్‌ టోర్నీలో పవర్‌ ప్లేలో వీలైనంత పరుగులు చేయడానికి వేగంగా ఆడాడు. 40, 80ల్లో కూడా చాలా సార్లు అవుట్‌ అయ్యారు. ఆ టైమ్‌లో రోహిత్‌ కాస్త దూకుడు తగ్గించి ఆడి ఉంటే.. హాఫ్‌ సెంచరీలు, సెంచరీలు పూర్తి చేసుకునే వాడు. కానీ, రోహిత్‌ ఎప్పుడూ అలా ఆడలేదు. జట్టు కోసమే ఆడాడు. ఇప్పుడు అదే విషయాన్ని మాటల్లో చెప్పాడంతే. మరి రోహిత్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments