Rohit Sharma: నేను ఒక్కడినే కాదు.. అది అందరి బాధ్యత: రోహిత్ శర్మ

గత కొంతకాలంగా ఓ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగటు క్రికెట్ అభిమానులను ఆందోళన పరుస్తోంది. మరి ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గత కొంతకాలంగా ఓ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగటు క్రికెట్ అభిమానులను ఆందోళన పరుస్తోంది. మరి ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గత కొంతకాలంగా ఓ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగటు క్రికెట్ అభిమానులను ఆందోళన పరుస్తోంది. ప్రపంచ క్రికెట్ లోకి టీ20, టీ10 లాంటి పొట్టి ఫార్మాట్స్ ఎప్పుడైతే.. రంగప్రవేశం చేశాయో, అప్పటి నుంచి టెస్ట్ క్రికెట్ పై ప్రేమ తగ్గిపోయింది. ఐదు రోజుల ఈ సంప్రదాయ బద్దమైన క్రికెట్ ను చూడడం ప్రేక్షకులకు బద్దకంగా మారింది. దీంతో రోజురోజుకు వీటిని చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గుకుంటూ వస్తోంది. ఈ విషయం క్రికెట్ లవర్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక టెస్ట్ క్రికెట్ గురించి మెున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంత చక్కగా వివరించాడో మనందరికి తెలిసిందే. తాజాగా ఈ సంప్రదాయ బద్ద ఫార్మాట్ గురించి టీమిండియా సారథి రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ కోసం టీమిండియా సిద్దమైంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ స్టార్ స్పోర్ట్స్ మీడియాతో మాట్లాడుతూ.. టెస్ట్ క్రికెట్ భవిష్యత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ..”క్రికెట్ చరిత్రలో టెస్ట్ ఫార్మాట్ కు ప్రత్యేక స్థానం ఉంది. దాన్ని కాపాడుకోవడమే కాదు.. దానికి తగిన గుర్తింపు ఇవ్వాలి. అయితే ఇది ఏ రెండు దేశాలకు సంబంధించిన విషయమో కాదు. టెస్టులు ఆడుతున్న అన్ని దేశాలకు సంబంధించినది. ఆ దేశాలు మెుత్తం టెస్టు క్రికెట్ ను బతికించుకోవడానికి నడుం బిగించాలి. నేను ఒక్కడినే కాదు.. నాలాంటి ఎంతో మంది ఆటగాళ్లు ముందుకురావాలి.. అప్పుడే టెస్ట్ ఫార్మాట్ బతుకుద్ది” అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రోహిత్ శర్మ చేసిన ఈ కామెంట్స్ క్రీడాలోకాన్ని ఆలోచింపజేస్తున్నాయి. మెున్న విరాట్ కోహ్లీ.. టెస్టుల గొప్పతన్నాని చెప్పగా, నేడు రోహిత్ టెస్ట్ లను కాపాడుకోవాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీని బట్టి టెస్ట్ క్రికెట్ మరణశయ్యపై ఉందని తెలుస్తోంది. క్రికెట్ ఇప్పుడు బిజినెస్ గా మారింది. దీంతో టెస్ట్ క్రికెట్ లాంటి సంప్రదాయ బద్ద ఫార్మాట్ కు కాలం చెల్లిపోయిందని కొందరు క్రీడా పండితులు పేర్కొంటున్నారు. మరి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments