Purnima Sharma: వరల్డ్‌ కప్‌ విజయం తర్వాత రోహిత్‌ తల్లి ఎమోషనల్‌ పోస్ట్‌! కోహ్లీని ప్రస్తావిస్తూ..

Rohit Sharma, Purnima Sharma, Virat Kohli, T20 World Cup 2024: భారత జట్టు టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత.. రోహిత్‌ శర్మ తల్లి ఒక ఎమోషనల్‌ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో కొడుకుతో పాటు విరాట్‌ కోహ్లీని కూడా ప్రస్తావించింది. ఆ పోస్ట్‌ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, Purnima Sharma, Virat Kohli, T20 World Cup 2024: భారత జట్టు టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత.. రోహిత్‌ శర్మ తల్లి ఒక ఎమోషనల్‌ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో కొడుకుతో పాటు విరాట్‌ కోహ్లీని కూడా ప్రస్తావించింది. ఆ పోస్ట్‌ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వంద కోట్ల మందికి పైగా భారత క్రికెట్‌ అభిమానులను సంతోషంలో ముంచుతూ.. సంబురాలు చేసుకునేలా చేసింది రోహిత్‌ సేన. వెస్టిండీస్‌ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచి.. విశ్వవిజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ఆటతో.. ఓటమి ఎరుగని జట్టుగా టీ20 వరల్డ్‌ కప్‌ను కైవలం చేసుకుంది టీమిండియా. ఈ విజయంతో.. 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ సందర్భంగా అయిన గాయానికి మందు రాసుకుంది. అయితే.. ఈ విజయంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పాత్ర అమోఘం. నాయకుడిగా జట్టును అద్భుతంగా నడిపిస్తూనే.. బ్యాటర్‌గా తన వంతు పాత్రను పోషించాడు. మొత్తంగా తన కెప్టెన్సీలో భారత్‌కు వరల్డ్‌ కప్‌ అందించాలనే లక్ష్యాన్ని చేరుకున్నాడు రోహిత్‌ శర్మ.

ఇలాంటి ఆనందకర సమయంలో రోహిత్‌ శర్మ తల్లి పూర్ణిమ శర్మ.. ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. వరల్డ్‌ కప్‌ గెలిచిన తన కుమారుడిని అభినందిస్తూనే.. మరో సూపర్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీని తన పోస్ట్‌లో ప్రస్తావిస్తూ భావోద్వేగపూరిత పోస్ట్‌ పెట్టింది. ఆ పోస్ట్‌కు రోహిత్‌ అభిమానులతో పాటు విరాట్‌ కోహ్లీ ఫ్యాన్స్‌ కూడా ఫిదా అయిపోతున్నారు. ఇంతకీ పూర్ణిమమ్మ ఏం చెప్పిందంటే.. ‘టీ20 క్రికెట్‌లో గోట్‌(గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌)జోడీ.. అతని భుజాలపై కూతురు, అతని వెనుక దేశం, పక్కనే సోదరుడు’ అంటూ పోస్ట్‌ చేసింది.

దానికి రోహిత్‌ శర్మ తన భుజాలపై కూతురు సమైరా, పక్కనే విరాట్‌ కోహ్లీ కప్పుతో ఉన్న ఫొటోను జత చేసింది. ఈ పోస్ట్‌లో రోహిత్‌ శర్మకు సోదరుడిగా విరాట్‌ కోహ్లీని పేర్కొనడం హైలెట్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఎన్నో ఏళ్లుగా కలిసి ఆడుతున్నారు. ఇద్దరూ ఇండియన్‌ క్రికెట్‌కు ఎంతో సేవ చేశారు. తాజాగా ఇద్దరూ ఒకేసారి అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. భారత్‌కు టీ20 వరల్డ్ కప్‌ అందించిన తర్వాతనే ఇద్దరు యువ క్రికెటర్ల కోసం ఈ ఫార్మాట్‌ నుంచి తప్పుకోవడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే సమయంలో రోహిత్‌ తల్లి పూర్ణిమ శర్మ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. పూర్ణిమది స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నమే. ఆమె తెలుగు ఆడపడుచే. ఒక తెలుగు మహిళ దేశం గర్వించే క్రికెటర్‌ను అందించడం తెలుగువారికి గర్వం కారణం. మరి ఆమె చేసిన పోస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments