లంకలో ల్యాండ్‌ అయిన రోహిత్‌! ఆ స్టార్‌ క్రికెటర్‌తో డీప్‌ డిస్కషన్‌

లంకలో ల్యాండ్‌ అయిన రోహిత్‌! ఆ స్టార్‌ క్రికెటర్‌తో డీప్‌ డిస్కషన్‌

Rohit Sharma, Angelo Mathews, IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌ కోసం కాస్త ముందుగానే లంక గడ్డపై అడుగుపెట్టిన రోహిత్‌ శర్మ.. తాజాగా ఓ శ్రీలంక వెటరన్‌ క్రికెటర్‌తో చాలా సేపు మాట్లాడుతూ కనిపించాడు. దాని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, Angelo Mathews, IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌ కోసం కాస్త ముందుగానే లంక గడ్డపై అడుగుపెట్టిన రోహిత్‌ శర్మ.. తాజాగా ఓ శ్రీలంక వెటరన్‌ క్రికెటర్‌తో చాలా సేపు మాట్లాడుతూ కనిపించాడు. దాని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రీలంకతో టీ20 సిరీస్‌ నడుస్తుండగానే.. టీమిండియా వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ లంక గడ్డపై అడుగుపెట్టేశాడు. ఆగస్టు 2 నుంచి శ్రీలంకతో భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ కోసం రోహిత్‌ శర్మ ఆదివారం శ్రీలంకకు చేరుకున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన తర్వాత.. రోహిత్‌ శర్మ తొలిసారి గ్రౌండ్‌లోకి దిగినున్నాడు. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ తర్వాత పూర్తిగా రెస్ట్‌ మూడ్‌లోకి వెళ్లిపోయిన రోహిత్‌.. కుటుంబంతో కలిసి ఇటీవల యూఎస్‌ టూర్‌కు కూడా వెళ్లి వచ్చాడు.

యూఎస్‌ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత.. వెంటనే శ్రీలంకకు వెళ్లిపోయాడు. వన్డే సిరీస్‌కి ముందు కావాల్సినంత ప్రాక్టీస్‌ కోసం రోహిత్‌ కాస్త ముందుగానే లంకకు చేరుకున్నాడు. వన్డే సిరీస్‌ ఆడే ఆటగాళ్లు ఒక్కొక్కరిగా లంకకు చేరుకుంటున్నారు. అయితే.. శ్రీలంకకు వెళ్లిన తర్వాత.. సోమవారం కొలంబో క్రికెట్‌ స్టేడియంలో రోహిత్‌ శర్మ శ్రీలంక వెటరన్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ ఏంజిలో మ్యాథ్యూస్‌తో చాలా సేపు మాట్లాడుతూ కనిపించాడు. వారిద్దరి మధ్య డిస్కషన్‌ గురించి సోషల్‌ మీడియాలో పలు విషయాలు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు ఏ విషయం గురించి అంత సేపు మాట్లాడుకున్నారో అంటూ క్రికెట్‌ అభిమానులు తెగ సెర్చ్‌ చేస్తున్నారు.

పైగా మ్యాథ్యూస్‌తో రోహిత్‌ శర్మకు పెద్దగా సాన్నిహిత్యం కూడా లేదు. ఇద్దరూ కలిసి ఐపీఎల్‌లో ఒక్క టీమ్‌కు కూడా ఆడలేదు. మరి అంత సేపు ఈ ఇద్దరు క్రికెటర్లు దేని గురించి మాట్లాడుకున్నారో తెలియలేదు. ఇటీవల టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన రోహిత్‌ శర్మను.. వరల్డ్‌ కప్‌ విశేషాల గురించే మ్యాథ్యూస్‌ అడిగి ఉంటాడని తెలుస్తోంది. కాగా.. ఆగస్టు 2 నుంచి భారత్‌-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఆగస్టు 2, 4, 7వ తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు కూడా కొలంబోలోనే నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025పై ఫోకస్‌ పెట్టిన రోహిత్‌ శర్మ.. వన్డే క్రికెట్‌ను ఎక్కువ ఆడాలని నిర్ణయించుకున్నాడు. అందుకే శ్రీలంక సిరీస్‌ను స్కిప్‌ చేయడం లేదు. ఆ విషయం అటుంచితే.. మ్యాథ్యూస్‌తో రోహిత్‌ మాటామంతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments