Rohit Sharma: ముంబైలోనే రోహిత్.. ఫ్రాంచైజీ మారకుండా అడ్డుపడుతోంది అదే..!

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తీసేయడంతో కోపంలో ఉన్న రోహిత్ శర్మకు ఫ్రాంచైజీ మారేందుకు అవకాశం లేకుండా పోయింది. అసలు టీమ్​ మారకుండా హిట్​మ్యాన్​ను ఆపుతోంది ఏంటో ఇప్పుడు చూద్దాం..

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తీసేయడంతో కోపంలో ఉన్న రోహిత్ శర్మకు ఫ్రాంచైజీ మారేందుకు అవకాశం లేకుండా పోయింది. అసలు టీమ్​ మారకుండా హిట్​మ్యాన్​ను ఆపుతోంది ఏంటో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్​ ఇండివిడ్యువల్ గేమ్ కాదనేది తెలిసిందే. టీమ్​లో ఉన్న పదకొండు మంది ప్లేయర్లూ కలసికట్టుగా ఆడితేనే గెలవగలరు. అందుకే పర్సనల్ రికార్డుల కంటే జట్టు విజయానికే జెంటిల్మన్ గేమ్​లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. టీమ్​లో ఎంత మంది స్టార్ ప్లేయర్లు ఉన్నా వాళ్లందరూ కెప్టెన్ నిర్ణయానికి కట్టుబడాల్సిందే. సరైన టైమ్​కు సరైన నిర్ణయాలు తీసుకుంటూ, అందుబాటులో ఉన్న వనరుల్ని సరిగ్గా వినియోగించుకునే సత్తా, ప్లేయర్ల నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్​ను రాబట్టే కెప్టెన్ ఉంటే ఆ జట్టుకు తిరుగుండదు. అలాంటి బెస్ట్ కెప్టెన్ల లిస్టులో చేర్చదగ్గ వారిలో రోహిత్ శర్మ ఒకడు. ఇంటర్నేషనల్ క్రికెట్​ను పక్కనబెడితే.. ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్​ను అతడు లీడ్ చేసిన విధానాన్ని ఎవ్వరైనా మెచ్చుకోక తప్పదు. పదేళ్ల డ్యురేషన్​లో ముంబైకి ఏకంగా 5 ట్రోఫీలు అందించాడు రోహిత్. అలాంటోడ్ని సడన్​గా కెప్టెన్సీ నుంచి తీసేసింది ఎంఐ.

కెప్టెన్సీ నుంచి తనను తీసేయడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న హిట్​మ్యాన్​ ముంబైని వీడతాడంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అతడు ఎంఐని వదిలి బయటకు వెళ్లడం అంత ఈజీ కాదు. ముంబై ఫ్రాంచైజీని వదలకుండా రోహిత్​కు ఓ రూల్ అడ్డుపడుతోంది. అదే టీమ్ కాంట్రాక్ట్. దీని కారణంగా ముంబైని వదలి వెళ్లలేని పరిస్థితి. ఆల్రెడీ హిట్​మ్యాన్​ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ సహా ఒకట్రెండు ఫ్రాంచైజీలు ప్రయత్నించాయని తెలుస్తోంది. అయితే ముంబై ఇండియన్స్​తో అతడికి ఉన్న కాంట్రాక్ట్ డీల్ కారణంగా అది కుదరలేదట. రోహిత్​ను ఇచ్చేందుకు ఎంఐ ఒప్పుకోలేదని టాక్. ఇటీవల జరిగిన ఐపీఎల్ ప్లేయర్ల రిటెన్షన్ టైమ్​లోనే రోహిత్​ కోసం ఢిల్లీ ప్రయత్నించిందట. అటు గుజరాత్ టైటాన్స్​తో ముంబై ఇండియన్స్ జోరుగా చర్చలు సాగిస్తున్న సమయంలోనే ఇటు ఢిల్లీ కూడా ట్రై చేసిందని వినికిడి. కానీ కాంట్రాక్ట్ డీల్ కారణంగా అతడ్ని దక్కించుకోవడం కుదరలేదని సమాచారం.

కాంట్రాక్ట్ డీల్ కారణంగా వేరే టీమ్​కు వెళ్లే ఛాన్స్ లేకపోవడంతో మరికొన్నాళ్లు ముంబైలోనే రోహిత్ ఉండిపోవడం గ్యారెంటీ. అయితే ఎంఐ తరఫున 2024 సీజనే అతడికి ఆఖరుది అని వార్తలు వస్తున్నాయి. 2025 సీజన్​కు ముందు మెగా ఆక్షన్ ఉంటుంది. ప్రతి టీమ్ నలుగురు ప్లేయర్లను మాత్రమే అట్టిపెట్టుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందులో ముగ్గురు టీమిండియా ప్లేయర్లకు మాత్రమే అవకాశం. ఈ నేపథ్యంలో ముంబై హార్దిక్​ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్​ప్రీత్ బుమ్రాను అట్టిపెట్టుకొని రోహిత్​ను వదిలేసే ఛాన్సులు ఉన్నాయి. కానీ రోహిత్​తో ముంబై వ్యవహరించిన తీరు మీద అసంతృప్తితో ఉన్న సూర్యకుమార్, బుమ్రాలు కంటిన్యూ అయ్యే సూచనలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ హిట్​మ్యాన్​తో పాటు వాళ్లు కూడా బయటకు వచ్చేస్తే ముంబై మరింత బలహీనంగా మారుతుంది. మరి.. రోహిత్​ ఒకవేళ బయటకు వస్తే ఏ ఫ్రాంచైజీకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rohit Sharma: నిరాశలో ఉన్న రోహిత్ ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్.. హిట్​మ్యాన్ ఓకే అంటే..!

Show comments