iDreamPost
android-app
ios-app

వీడియో: ఫ్యాన్స్‌కు చాలా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన రోహిత్‌ శర్మ!

  • Published Apr 05, 2024 | 7:12 PM Updated Updated Apr 05, 2024 | 7:12 PM

Rohit Sharma, IPL 2024: ప్రస్తుతం రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ బీజీలో ఉన్నాడు. టీమ్‌లో ఎన్ని గొడవలు ఉన్నా.. మ్యాచ్‌పై ఫోకస్‌ పెట్టే రోహిత్‌.. తాజాగా తన అభిమానులకు చాలా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, IPL 2024: ప్రస్తుతం రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ బీజీలో ఉన్నాడు. టీమ్‌లో ఎన్ని గొడవలు ఉన్నా.. మ్యాచ్‌పై ఫోకస్‌ పెట్టే రోహిత్‌.. తాజాగా తన అభిమానులకు చాలా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 05, 2024 | 7:12 PMUpdated Apr 05, 2024 | 7:12 PM
వీడియో: ఫ్యాన్స్‌కు చాలా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన రోహిత్‌ శర్మ!

ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన ఫ్యాన్స్‌కు చాలా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న రోహిత్‌ శర్మ.. ఆదివారం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్‌ కోసం సిద్ధం అవుతున్నాడు. రోహిత్‌ ఉండేది కూడా ముంబైలోనే కాబట్టి మ్యాచ్‌కు మ్యాచ్‌కు కాస్త టైమ్‌ దొరికితే ఫ్యామిలీతో ఆ టైమ్‌ను స్పెండ్‌ చేస్తూ ఉంటాడు. తాజాగా తన ఫ్యామిలీతో వెళ్తున్న క్రమంలో రోహిత్‌ను అభిమానులు చుట్టుముట్టి.. ‘ముంబైకా రాజా.. రోహిత్‌ శర్మ’ అంటూ కేకలు పెట్టారు. వెంటనే రోహిత్‌ వాళ్లను సైలెంట్‌ అయిపోవాలని సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.

ఎందుకంటే ఆ టైమ్‌లో రోహిత్‌ గారాల పట్టి సమైరా రోహిత్‌ భుజాలపై నిద్ర పోతుంది. తన కూతురి నిద్రకు ఎక్కడ భంగం కలుగుతుందో అని రోహిత్‌ శర్మ.. తన అభిమానులకు అరవకండి అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. రోహిత్‌ శర్మకు కూతురంటే ఎంత ప్రేమో చూడండి అంటూ కామెంట్‌ చేస్తున్నారు. కాగా, రోహిత్‌ ఫ్యాన్స్‌కు వార్నింగ్‌ ఇస్తున్న సమయంలో రోహిత్‌ భార్య రితికా కూడా అక్కడే ఉంది. కూతురిని జాగ్రత్తగా ఉన్న కారులో కూర్చోబెట్టిన తర్వాత.. రోహిత్‌ రిలాక్స్‌ అయ్యాడు.

రోహిత్‌ తన కూతురిపై చూపిస్తున్న ఇష్టంపై అంతా ఫిదా అవుతున్నారు. ఈ విషయం పక్కనపెడితే.. శనివారం ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ ఆడనుంది. గత మ్యాచ్‌లో గోల్డెన్‌ డక్‌ అయిన రోహిత్‌ శర్మ.. ఈ మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటాలని రోహిత్‌ బలంగా ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. పైగా తనను కెప్టెన్సీ నుంచి తీసేసిన ముంబై ఇండియన్స్‌ యాజమాన్యానికి తన పవరేంటో చూపించాలని లీగ్‌ స్టార్టింగ్‌ నుంచే రోహిత్‌ మెంటల్‌గా ఫిక్స్‌ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన హోం గ్రౌండ్‌లో ఢిల్లీ పై చెలరేగాలని రోహిత్‌ భావిస్తున్నాడు. మరి ముంబై, ఢిల్లీ మ్యాచ్‌తో పాటు తన కూతురి కోసం ఫ్యాన్స్‌కు రోహిత్‌ వార్నింగ్‌ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş