కారు నంబర్‌ ప్లేట్‌ చూసి.. ఓనర్‌ ఎవరో చెప్పొచ్చు! క్లూ.. స్టార్‌ క్రికెటర్‌!

కారు నంబర్‌ ప్లేట్‌ చూసి.. ఓనర్‌ ఎవరో చెప్పొచ్చు! క్లూ.. స్టార్‌ క్రికెటర్‌!

Rohit Sharma, Lamborghini: కారు నంబర్‌ చూసి.. ఓనర్‌ పేరు చెప్పమనడం అంటే కాస్త తలతిక్క పనే కానీ, కొంతమందికి అది చాలా ఈజీ పని. అది ఎలాగో? అసలు ఆ కారు ఓనర్‌ ఎవరు? ఆ నంబర్‌ స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, Lamborghini: కారు నంబర్‌ చూసి.. ఓనర్‌ పేరు చెప్పమనడం అంటే కాస్త తలతిక్క పనే కానీ, కొంతమందికి అది చాలా ఈజీ పని. అది ఎలాగో? అసలు ఆ కారు ఓనర్‌ ఎవరు? ఆ నంబర్‌ స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం..

లంబోర్ఘిని.. చాలా ఖరీదైన కారు. మన దేశంలో చాలా కొద్ది మంది సెలబ్రెటీలు, బడా వ్యాపారవేత్తలు మాత్రమే ఈ లంబోర్ఘిని కారును కలిగి ఉన్నారు. తాజాగా ఈ లగ్జరీ కారు.. ముంబై రోడ్లపై పరుగులు తీసింది. ముంబై లాంటి మహానగరంలో లంబోర్ఘిని లాంటి ఖరీదైన కారు​ కనిపించడం పెద్ద విశేషం కాదు.. కానీ, ఆ కారు నంబర్, ఆ కారు ఓనర్‌ ఇక్కడ స్పెషల్‌. ఖరీదైన కారుకు మరింత క్రేజ్‌ తీసుకొచ్చింది ఆ నంబర్‌. ‘MH 01 EB 0264’ ఈ నంబర్‌ ప్లేట్‌తో ఉన్న కారు.. వీడియోలు, ఫొటోలు నిన్నటి నుంచి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ఏంటా నంబర్‌ స్పెషల్‌ అంటే..

ఆ నంబర్‌ను బట్టి కార్‌ ఓనర్‌ ఎవరో ఇట్టే చెప్పేయొచ్చు. అదేంటి.. కారు నంబర్‌ చూసి ఓనర్‌ ఎవరో ఎలా చెప్తాం అని అనుకుంటున్నారా? అయితే.. ఇదే కారు నంబర్‌ను ఓ క్రికెట్‌ అభిమానికి చూపిస్తే.. అతను కొద్ది సేపు ఆలోచించి ఓనర్‌ ఎవరో చెప్పే ఛాన్స్‌ ఉంది. అదే నంబర్‌ ప్లేట్‌ను ఓ రోహిత్‌ శర్మ అభిమానికి చూపిస్తే మాత్రం.. వెంటనే చెప్పేస్తారు.. ఇది మా రోహిత్‌ అన్న కారు అని. ఎందుకంటే.. ఆ నంబర్‌ చివర్లలో ఉన్న ‘0264’ అంటే అంత స్పెషల్‌ మరి. 264 నంబర్‌ అంటే టక్కున గుర్తుకు వచ్చేది టీమిండియా వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మనే.

264 రోహిత్‌కు ఎందుకంటే స్పెషల్‌..?
అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్ప బ్యాటర్‌గా ఉన్న రోహిత్‌ శర్మ.. 2014లో శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో ఏకంగా 264 పరుగుల భారీ స్కోర్‌ కొట్టాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలోనే ఇదే అత్యధిక వ్యక్తి గత స్కోర్‌. ఆ మ్యాచ్‌లో కేవలం 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సులతో 264 పరుగులు చేశాడు. రోహిత్‌ శర్మ సృష్టించిన విధ్వంసంతో ఆ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 404 పరుగులు భారీ స్కోర్‌ చేసింది. కోహ్లీ కూడా 66 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత శ్రీలంకను 251 పరుగులు చేసి ఆలౌట్‌ చేసి.. 153 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది భారత జట్టు. అప్పటి నుంచి 264 నంబర్‌ రోహిత్‌ శర్మకు స్పెషల్‌గా మారిపోయింది. తాను కొన్న లగ్జరీ కారుకు 264 నంబర్‌ చివర్లో వచ్చేలా నంబర్‌ ప్లేట్‌ తీసుకున్నాడు రోహిత్‌. మరి ఈ స్పెషల్‌ నంబర్‌ ప్లేట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments