Rohit Sharma: సచిన్‌, కోహ్లీని కాదని.. పాక్‌ బౌలర్‌ సంచలన స్టేట్‌మెంట్‌!

సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ.. క్రికెట్‌ ప్రపంచానికే గర్వకారణంగా నిలిచే ఆటగాళ్లు. అలాంటిది ఇండియన్‌ క్రికెట్‌లో వీళ్లిద్దరినీ మించి ఇంకో ఆటగాడు ఉన్నాడంటూ.. ఓ పాకిస్థాన్‌ ఆటగాడు తాజాగా భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. మరి అతనెవరో.. ఎవరి గురించి మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ.. క్రికెట్‌ ప్రపంచానికే గర్వకారణంగా నిలిచే ఆటగాళ్లు. అలాంటిది ఇండియన్‌ క్రికెట్‌లో వీళ్లిద్దరినీ మించి ఇంకో ఆటగాడు ఉన్నాడంటూ.. ఓ పాకిస్థాన్‌ ఆటగాడు తాజాగా భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. మరి అతనెవరో.. ఎవరి గురించి మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

ఇండియన్‌ క్రికెట్‌లోనే కాదు.. ప్రపంచ క్రికెట్‌లోనే గొప్ప క్రికెటర్లలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉంటాడు సచిన్‌ టెండూల్కర్‌. నిజానికి సచిన్‌ను క్రికెట్‌ దేవుడు అంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్‌లో దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని.. టన్నుల కొద్ది పరుగులు చేసిన సచిన్‌ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. సచిన్‌ ఆడుతున్న.. తీరు చూసి.. ఇలాంటి ఆటగాడు మళ్లీ పుడతాడా? అని అప్పట్లో భావించే వారు. కానీ, సచిన్‌ ఫీల్డ్‌లో ఉండగానే మరో చిచ్చరపిడుతు దూసుకొచ్చాడు. అతనే విరాట్‌ కోహ్లీ. ఇప్పటికే సచిన్‌ తర్వాత సచిన్‌ అంతటోడనే బిరుదు సంపాదించుకున్నాడు. నిజానికి వన్డే క్రికెట్‌లో సచిన్‌ కంటే గొప్పగా ఆడుతున్నాడు. ఇప్పటికే వన్డే క్రికెట్‌ చరిత్రలోనే ఎవరూ చేయనన్ని సెంచరీలు చేశాడు.

ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో మూడు సెంచరీలు బాదిన కోహ్లీ.. వన్డే ఫార్మాట్‌లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. 50వ సెంచరీతో.. వన్డే క్రికెట్‌లో 49 సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఉన్న సచిన్‌ టెండూల్కర్‌ను దాటేసి.. కొత్త చరిత్ర లిఖించాడు. ఎంతో కాలం నుంచి సచిన్‌ రికార్డుల వెంటపడుతున్న కోహ్లీ.. ఒక్కొక్కటిగా తన ఆరాధ్య క్రికెటర్‌ రికార్డులను దాటుతూ వస్తున్నాడు. ఇలా ఇద్దరు ఇండియన్‌ క్రికెటర్లు.. ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్లుగా ఉన్నారు. భారత క్రికెట్‌కు అయితే వీరిద్దరు లెజెండ్స్‌. కానీ, వీళ్లద్దరిని పక్కన పెట్టిన ఓ పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌.. మరో భారత ఆటగాడే.. ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ ఇండియన్‌ బ్యాటర్‌ అంటూ భారీ స్టేట్‌మెంట్‌ పాస్‌ చేశాడు.

పాక్‌ మాజీ పేసర్‌ జునైద్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మనే.. గ్రేటెస్ట్‌ ఇండియన్‌ బ్యాటర్‌ అని పేర్కొన్నాడు. అతని వద్ద లేని షాట్‌ అంటూ లేదని, అతను ఏ షాట్‌నైనా చాలా సులువుగా ఆడగలడని.. అందుకే రోహిత్‌ శర్మ భారత క్రికెట్‌లో గొప్ప ఆటగాడని కొనియాడాడు. అయితే.. రోహిత్‌ శర్మ కూడా గొప్ప ప్లేయర్‌ అని.. కానీ, సచిన్‌ను మర్చిపోయి.. రోహిత్‌ను గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌ అని పేర్కొనడంపై కొంతమంది క్రికెట్‌ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి పాకిస్థన్‌ మాజీ క్రికెటర్‌ జునైద్‌ ఖాన్‌.. రోహిత్‌ శర్మను భారత గొప్ప బ్యాటర్‌ అని పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments