నేను మంచోడ్ని.. కాబట్టే నా విషయంలో అలా జరిగింది: రోహిత్‌ శర్మ

Rohit Sharma, Team India: 17 ఏళ్లు క్రికెట్‌ కెరీర్‌ పూర్తి అయిన సందర్భంగా రోహిత్‌ శర్మ అనేక విషయాలపై తన మనసులో మాటలు బయటపెట్టాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Team India: 17 ఏళ్లు క్రికెట్‌ కెరీర్‌ పూర్తి అయిన సందర్భంగా రోహిత్‌ శర్మ అనేక విషయాలపై తన మనసులో మాటలు బయటపెట్టాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024కి ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన క్రికెట్‌ కెరీర్‌ 17 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా రోహిత్‌ శర్మ దుబాయ్‌ ఐ 103.8 వెబ్‌సైబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తన కెరీర్‌కు సంబంధించిన అనేక అంశాలపై రోహిత్‌ ఈ సందర్భంగా మాట్లాడాడు. క్రికెట్‌లో తాను ఈ స్థాయికి ఎదిగేందుకు కారణమైన విషయాల గురించి వివరించాడు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే.. కుటుంబ సభ్యులు, స్నేహితుల వల్లే అని, వారే తనను ప్రోత్సహించారని రోహిత్ వెల్లడించాడు.

క్రికెట్ తన సర్వస్వం అని, ఈ జర్నీ ఇప్పుడు 17 సంవత్సరాలకు చేరుకుందని, ఈ అద్భుత ప్రయాణానికి ఇక్కడితో పుల్ స్టాప్ పెట్టాలనుకోవట్లేదని అన్నాడు. మరి కొన్నేళ్లు ఆడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు హిట్‌మ్యాన్‌. టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం తనకు లభించిన అతి పెద్ద గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు. టీమిండియా కెప్టెన్సీ తనకు దక్కుతుందని, జట్టును నడిపిస్తానని తాను ఏ రోజు అనుకోలేదని, అలాంటి రోజు ఒకటి వస్తుందని కూడా ఊహించనే లేదని పేర్కొన్నాడు.

మంచి వాళ్లుకు ఎప్పుడూ మంచే జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు.. దానికి ఉదాహరణే నా కెప్టెన్సీ అని చెప్పాడు. నేను ఎప్పుడూ వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించలేదు, టీమ్‌లోని అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం, మ్యాచ్‌ గెలవడం ఇదే తన లక్ష్యం అని రోహిత్‌ పేర్కొన్నాడు. అయితే మన టైమ్‌ బాగున్నప్పుడు అందరి దృష్టిలో మంచివాడిగా కనిపిస్తామని, అందరూ దేవుడిలా ఆరాధిస్తారని, అదే బ్యాడ్‌ టైమ్‌లో ఉంటే ఇంటిపై రాళ్లు కూడా పడతాయని అన్నాడు రోహిత్‌. కాగా, ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ తరఫున తన చివరి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధం అవుతున్నాడు రోహిత్‌. తర్వాత వెస్టిండీస్‌, అమెరికా వేదికగా జరిగే టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో టీమిండియాను నడిపించనున్నాడు. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత సెలెక్టర్లు 15 మందితో కూడా స్క్వౌడ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మరి రోహిత్‌ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments