ఫైనల్‌లో టీమిండియా గెలవడానికి అసలు కారణం ఇదే! కెప్టెన్‌ రగిల్చిన కసితో..

ఫైనల్‌లో టీమిండియా గెలవడానికి అసలు కారణం ఇదే! కెప్టెన్‌ రగిల్చిన కసితో..

Rohit Sharma, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను భారత జట్టు సాధించడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ, తెర వెనుక పనిచేసిన ఒక బలమైన కారణం గురించి ఇప్పుడే తెలిసింది. మరి ఆ కారణం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Rohit Sharma, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను భారత జట్టు సాధించడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ, తెర వెనుక పనిచేసిన ఒక బలమైన కారణం గురించి ఇప్పుడే తెలిసింది. మరి ఆ కారణం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గత పదేళ్లుగా టీమిండియా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలవకముందు నుంచి ఎంత స్ట్రాంగ్‌గా ఉందో.. అంతకంటే ఎక్కువగానే బలపడింది. ప్రపంచంలోని ప్రతి టీమ్‌ను ఓడించే సత్తాతో అగ్రశ్రేణి టీమ్‌గా కొనసాగుతూ వచ్చింది. టెస్ట్‌, వన్డే, టీ20 ఫార్మాట్‌ ఏదైనా ఆధిపత్యం చెలాయించింది.. కానీ, ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయింది. సెమీ ఫైనల్‌, ఫైనల్‌ వరకు రావడం ఓడిపోవడం. తుది పోరులో లైన్‌ దాటేలేపోయింది. అదొక్కటే జట్టులో మైనస్‌. జట్టు పరంగా చాలా స్ట్రాంగ్‌ టీమ్‌.. ప్రతి ఫార్మాట్‌లోనూ హాట్‌ ఫేవరేట్‌. 2015, 2019, 2021, 2022, 2023 ఏడాదుల్లో జరిగిన ప్రతి ఐసీసీ టోర్నీలోనూ గట్టి పోటీ ఇచ్చింది. కానీ, కప్పును ముద్దాడలేకపోయింది.

2021 డబ్ల్యూటీసీ ఫైనల్‌, 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌.. ఈ మూడు ఫైనల్స్‌..  జట్టుతో పాటు భాతర క్రికెట్‌ అభిమానుల హృదయాలను ముక్కలు చేసిన మ్యాచ్‌లు. అలాంటి హార్ట్‌ బ్రేకింగ్‌ సిచ్యూవేషన్‌.. ఈ సారి రావొద్దని బలంగా కోరుకున్న వ్యక్తి టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. భారతదేశానికి కెప్టెన్‌గా వరల్డ్‌ కప్‌ అందించాలని మూడేళ్ల నుంచి కలగంటూ కష్టపడుతున్న ఆటగాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా 2022లో టీ20 వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌లో ఓడిపోయింది.. 2023లో వన్డే వరల్డ్‌ కప్‌, డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఓడిపోయింది.. కానీ, టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌లో మాత్రం అలాంటి పరిస్థితి రావొద్దని.. జట్టులో కసిని నూరిపోశాడు.

జట్టులోని ప్రతి ఆటగాడి రక్తం మరిగేలా అదిరిపోయే స్పీచ్‌ ఇచ్చాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌కి ముందు రోహిత్‌ శర్మ టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఇచ్చిన మోటివేషనల్‌ స్పీచ్‌ తాజాగా బయటికి వచ్చింది. ప్రతిసారి ఫైనల్‌లో ఏం మిస్‌ అవుతున్నామో ఈ సారి అది కాకుండా ఆటగాళ్లను రెచ్చగొట్టాడు. ఇంతకీ రోహిత్‌ ఏం అన్నాడంటే.. ‘నేను ఒక్కడ్నే ఈ పర్వతాన్ని ఎక్కలేను. నేను పర్వతపు అంచును చేరుకోవాలంటే ప్రతి ఒక్కరి ఆక్సీజన్‌ నాకు అవసరం. మీలో ఉన్న శక్తినంత బయటికి తీయండి. మీ కాళ్లలో ఉన్న బలాన్ని, మెదడులో ఉన్న కప్పు గెలవాలనే ఆలోచనని, ఛాంపియన్‌ అవ్వాలని మనసులో ఉన్న బలమైన కోరికను.. ఫైనల్‌ కోసం బయటికి తీయండి. మన వందశాతం శక్తిని బయటికి తీస్తే.. ఈ రోజు ఏం జరిగినా మనం బాధపడం’ అంటూ రోహిత్‌ పేర్కొన్నాడు. కెప్టెన్‌ ఇచ్చిన ఈ స్పీచ్‌తో ఆటగాళ్లందరిలో స్ఫూర్తి రగిలింది. ఇదే విషయాన్ని సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా పేర్కొన్నాడు. రోహిత్‌ ఇచ్చిన స్పీచ్‌ తమలో మరింత కసి పెంచిందని అన్నాడు. మరి ఫైనల్‌కి ముందు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఆటగాళ్లలో కసి పెంచేందుకు ఇచ్చిన స్పీచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments