వన్డే వరల్డ్-2023 ఆరంభం కావడానికి ముందే టీమిండియాలో టెన్షన్ మొదలైంది. ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే, బరిలోకి దిగకుండానే జట్టులో గుబులు ప్రారంభమైంది. ఫస్ట్ మ్యాచ్‌కు టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్లేయర్ల విషయంలో ఆందోళన కలుగుతోంది. భారత ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డెంగ్యూ బారిన పడినట్లు న్యూస్ వచ్చింది. ఈ వార్త కాస్తా కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అయితే అతడి పరిస్థితి బాగానే ఉందంటూ కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా బీసీసీఐ వర్గాలు చెప్పడంతో అభిమానులకు ఊరట లభించింది.
గిల్ హెల్త్‌పై వర్నీ అవుతున్న సమయంలో మరో షాకింగ్ విషయం బయటికొచ్చింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వేలికి గాయమైందని సమాచారం. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న టైమ్‌లో అతడికి ఇలా జరిగిందని తెలుస్తోంది. అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. దీని మీద బీసీసీఐ అఫీషియల్‌గా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆస్ట్రేలియాతో చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే మ్యాచ్‌లో పాండ్యా అందుబాటులో ఉండే ఛాన్స్ ఎక్కువేనని తెలుస్తోంది. కాగా, గిల్ అనారోగ్యం పాలైనట్లు చెప్పిన బీసీసీఐ.. అతడికి డెంగ్యూ వచ్చిందని కన్ఫర్మ్ చేయలేదు. డెంగ్యూ వస్తే కోలుకునేందుకు మినిమం 10 రోజులు పడుతుంది. ఒకవేళ గిల్‌కు జ్వరం వస్తే మాత్రం పాకిస్థాన్‌తో శనివారం జరిగే మ్యాచ్ వరకు అందుబాటులో ఉండకపోవచ్చు.
గిల్ దూరమైతే మరో యంగ్‌స్టర్ ఇషాన్ కిషన్‌తో కలసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ హెల్త్ కండీషన్‌పై తాజాగా హిట్‌మ్యాన్ స్పందించాడు. గిల్ ఇంకా అనారోగ్యంగానే ఉన్నాడని చెప్పిన రోహిత్.. మ్యాచ్ మొదలవ్వడానికి ముందు తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. ‘శుబ్‌మన్ గిల్ చాలా సిక్ అయ్యాడు. అతడ్ని మా మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. అతడి హై ఫీవర్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కెప్టెన్‌గా కాకుండా ఒక మనిషిగా గిల్ త్వరగా రికవర్ కావాలని కోరుకుంటున్నాను’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. గిల్ ఇంకా టీమ్‌కు అందుబాటులోనే ఉన్నాడని.. వరల్డ్ కప్ నుంచి అతడు దూరమవ్వలేదని రోహిత్ పేర్కొన్నాడు. రికవరీ అయ్యేందుకు గిల్‌కు అన్ని ఛాన్సులు ఇస్తామని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు. మరి.. గిల్ ఎప్పటివరకు కోలుకుంటాడో చూడాలి.
ఇదీ చదవండి: World Cup: అది మర్చిపోయి బ్యాటింగ్‌కు దిగిన బ్యాటర్! నవ్వులు తెప్పిస్తున్న వీడియో!
Rohit Sharma said, “we’ll give every chance to Shubman Gill to recover. He’s still not ruled out”. pic.twitter.com/10bnmBq5Tk
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 7, 2023