iDreamPost
android-app
ios-app

Rohit Sharma:రోహిత్ సెంచరీ.. గొప్ప మనసు చాటుకున్న అభిమానులు!

  • Published Jan 19, 2024 | 8:00 AM Updated Updated Jan 19, 2024 | 7:30 PM

క్రికెట్ అభిమానులు క్రికెట్ కు కొత్త దేవుడిని పరిచయం చేశారు. టీమిండియా సారథి రోహిత్ శర్మను న్యూ గాడ్ ఆఫ్ క్రికెట్ అంటూ తమ అభిమానం చాటుకున్నారు. అంతేకాదు రోహిత్ అద్భుతమైన మ్యాచ్ ఆడిన వేళ అతని ఫ్యాన్స్ గొప్ప మనసు చాటుకున్నారు.

క్రికెట్ అభిమానులు క్రికెట్ కు కొత్త దేవుడిని పరిచయం చేశారు. టీమిండియా సారథి రోహిత్ శర్మను న్యూ గాడ్ ఆఫ్ క్రికెట్ అంటూ తమ అభిమానం చాటుకున్నారు. అంతేకాదు రోహిత్ అద్భుతమైన మ్యాచ్ ఆడిన వేళ అతని ఫ్యాన్స్ గొప్ప మనసు చాటుకున్నారు.

  • Published Jan 19, 2024 | 8:00 AMUpdated Jan 19, 2024 | 7:30 PM
Rohit Sharma:రోహిత్ సెంచరీ.. గొప్ప మనసు చాటుకున్న  అభిమానులు!

సాధారణంగా క్రికెట్ దేవుడు అనగానే మనందరికి గుర్తొచ్చే పేరు భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్. క్రికెట్ లో సచిన్ ఒక సంచలనం. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ పేరు. ఎన్నో రికార్డులను నెలకొల్పి సరికొత్త చరిత్రను సృష్టించిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్. మన దగ్గర క్రికెట్ ను ఎంతలా ప్రేమిస్తారో క్రికెటర్లను కూడా అంతే స్థాయిలో ఆరాదిస్తారు క్రికెట్ లవర్స్. ఇప్పుడు క్రికెట్ అభిమానులు క్రికెట్ కు కొత్త దేవుడిని పరిచయం చేశారు. టీమిండియా సారథి రోహిత్ శర్మను న్యూ గాడ్ ఆఫ్ క్రికెట్ అంటూ తమ అభిమానం చాటుకున్నారు. అంతేకాదు రోహిత్ అద్భుతమైన మ్యాచ్ ఆడిన వేళ అతని ఫ్యాన్స్ గొప్ప మనసు చాటుకున్నారు.

బుధవారం నాడు భారత్ -అఫ్గాన్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో రోహిత్ మెరుపు బ్యాటింగ్ తో టీమిండియా విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ ఆరంభంలో భారత్ తడబడింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత హిట్ మ్యాన్ బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ సమయంలో నయా ఫినిషర్ రింకూ సింగ్ తన మద్దతును అందించాడు. ఇక ఈ మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ 121 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.

rohit fans supply food packets

69 బంతుల్లో 8 సిక్సులు, 11 ఫోర్లతో అఫ్గాన్ బౌలర్లను చీల్చి చెండాడాడు. ఇక రోహిత్ మెరుపు బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో రోహిత్ అభిమాని గొప్ప మనసు చాటుకున్నాడు. రోహిత్ సెంచరీ చేసి మ్యాచ్ ను గెలిపించిన వేళ ఓ అభిమాని అందరికంటే భిన్నంగా అభాగ్యులకు ఆహారం పంపిణీ చేశాడు. లంచ్ బాక్స్ పై న్యూ గాడ్ ఆఫ్ క్రికెట్ రోహిత్ శర్మ అని ముద్రించి రోడ్డు పక్కన ఉండే వృద్ధులు, పిల్లలకు అందజేశాడు. దీనిపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. మరి రోహిత్ అభిమాని ఫుడ్ సప్లై చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş