రోహిత్ రేర్ రికార్డు.. హిస్టరీలో సచిన్ తరువాత ఒకేఒక్కడు!

Rohit Sharma, Sachin Tendulkar: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో రోహిత్‌ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. అయితే.. ఈ సెంచరీతో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ తర్వాత ఒకే ఒక్కడిగా నిలిచాడు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Sachin Tendulkar: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో రోహిత్‌ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. అయితే.. ఈ సెంచరీతో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ తర్వాత ఒకే ఒక్కడిగా నిలిచాడు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌పై మరోసారి చెలరేగాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఒక సెంచరీ బాదిన రోహిత్‌.. తాజాగా ఐదో టెస్టులోనూ సెంచరీతో సత్తా చాటాడు. భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ధర్మశాల వేదికగా గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో తొలుత ఇంగ్లండ్‌ను తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ చేసిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌కు బరిలోకి దిగి భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే రోహిత్‌ శర్మ సెంచరీ సాధించాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన రోహిత్‌.. టీమిండియాకు మంచి స్టార్ట్‌ అందించాడు. రోహిత్‌-జైస్వాల్‌ తొలి వికెట్‌కు 104 పరుగుల జోడించారు. తొలి రోజు ఆట చివరి నిమిషాల్లో జైస్వాల్‌ అవుటైనా.. రోహిత్‌, గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు.

రెండో రోజు ఆటలో లంచ్‌ బ్రేక్‌ కంటే ముందు రోహిత్‌ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. 154 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. లంచ్‌ బ్రేక్‌ తర్వాత కొద్ది సేపటికే అవుట్‌ అయ్యాడు. మొత్తంగా 162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో 103 పరుగులు చేసి రోహిత్‌ అవుట్‌ అయ్యాడు. ఈ సెంచరీతో రోహిత్‌ ఓ అరుదైన రికార్డును సాధించాడు. భారత క్రికెట్‌ చరిత్రలో 30 ఏళ్ల వయసు తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా ది గ్రేట్‌, క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును సమం చేశాడు. 30 ఏళ్ల నిండి.. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యేంత వరకు సచిన్‌ 35 సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 20, వన్డేల్లో 15 సెంచరీలు చేశాడు. 2003లో సచిన్‌కు 30 ఏళ్లు నిండాయి. అప్పటి నుంచి 2013లో తాను రిటైర్‌ అయ్యే టైమ్‌కు 35 సెంచరీలు బాదాడు. ఓవరాల్‌గా సచిన్‌ ఖాతాలో 100 సెంచరీలు ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పుడు రోహిత్‌ శర్మ సైతం సచిన్‌ రికార్డును సమం చేశాడు. 2017లో రోహిత్‌ శర్మ 30ల్లోకి ఎంట్రీ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోహిత్‌ 35 సెంచరీలు బాదాడు. మొత్తంగా రోహిత్‌ శర్మ ఖాతాలో 48 సెంచరీలు ఉన్నాయి. అందులో టెస్టుల్లో 12, వన్డేల్లో 31, టీ20ల్లో 5 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీతో.. 30 ఏళ్ల నిండిన తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్‌తో సమంగా నిలిచాడు. రోహిత్‌ మరికొంత కాలం క్రికెట్‌లో కొనసాగే అవకాశం ఉండటంతో.. సచిన్‌ రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా 30 ఏళ్ల నిండిన తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల లిస్ట్‌ ఇలా ఉంది. కుమార సంగార్కర్‌(శ్రీలంక) 43 సెంచరీలతో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నాడు. మ్యాథ్యూ హేడెన్‌(ఆస్ట్రేలియా) 36, రికీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా) 36 సెంచరీలు. వీరి తర్వాత రోహిత్‌ శర్మ 35 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. సచిన్‌ 308 ఇన్నింగ్స్‌ల్లో 35 సెంచరీలు చేస్తే.. రోహిత్‌ కేవలం 260 ఇన్నింగ్సుల్లోనే ఈ ఫీట్‌ సాధించాడు. మరి ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments