ఆ టైమ్‌లో ఎమోషనల్‌ అయ్యా! తొలిసారి ఓపెన్‌ అయిన రోహిత్‌ శర్మ

Rohit Sharma: ఐపీఎల్‌ 2024 ప్రారంభానికి ముందు రోహిత్‌ శర్మ చాలా ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. గత ఐదు, ఆరేళ్ల క్రితం ఎక్కడుండే వాడు.. ఇప్పుడు ఎక్కడున్నాడంటూ పేర్కొన్నాడు. మరి రోహిత్‌ ఎవర్ని ఉద్దేశించి ఈ కామెంట్స్‌ చేశాడో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma: ఐపీఎల్‌ 2024 ప్రారంభానికి ముందు రోహిత్‌ శర్మ చాలా ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. గత ఐదు, ఆరేళ్ల క్రితం ఎక్కడుండే వాడు.. ఇప్పుడు ఎక్కడున్నాడంటూ పేర్కొన్నాడు. మరి రోహిత్‌ ఎవర్ని ఉద్దేశించి ఈ కామెంట్స్‌ చేశాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు. కెప్టెన్సీ నుంచి తనను తప్పించి అవమానించినా కూడా… ఇన్నాళ్లు ఆడిన టీమ్‌ కోసం మరోసారి బరిలోకి దిగాడు. ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపినా.. తనను కాదని, రెండేళ్ల క్రితం డబ్బు కోసం జట్టును వీడి, మళ్లీ డబ్బుకోసమే తిరిగొచ్చిన ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న రోహిత్‌ శర్మ.. ఆ బాధనంత దిగమింగి.. ఐపీఎల్‌ 2024 కోసం ముంబై క్యాంపులో చేరాడు. టీమ్‌తో జాయిన్‌ అయ్యాడు కాని.. జట్టు సభ్యులతో మాత్రం అంటీముట్టనట్లు ఉంటున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్‌ శర్మ ఓ ఇంటర్వ్యూ వీడియో వచ్చింది. అందులో చాలా విషయాల గురించి రోహిత్‌ మాట్లాడాడు.

ముఖ్యంగా ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ గురించి రోహిత్‌ మాట్లాడుతూ తొలిసారి చాలా ఓపెన్‌ అయ్యాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడని టీమ్‌తో కలిసి తాను ఇంకా చాలా క్రికెట్‌ ఆడాలని అనుకుంటున్నట్లు రోహిత్‌ శర్మ వెల్లడించాడు. కుర్రాళ్లు ఎంతో అద్భుతంగా ఆడారని, వాళ్లు కాస్త తుంటరి వాళ్లు అయినా కూడా వారితో ఆడితే మజా వస్తుందని తెలిపాడు. ఈ క్రమంలోనే కొత్త కుర్రాళ్ల అరంగేట్రం గురించి మాట్లాడాడు. ఈ సిరీస్‌లో చాలా మంది డెబ్యూ చేశారు.. ఆ సమయంలో వాళ్లు చాలా ఎమోషనల్‌ అయ్యారు, వాళ్ల కుటుంబ సభ్యులు అక్కడ నిలబడి చూస్తుండగా టెస్ట్‌ క్యాప్‌ అందుకోవడం ఎంతో ఎమోషనల్‌ మూమెంట్‌. సర్ఫరాజ్‌ ఖాన్‌ ఫాదర్‌, ధృవ్‌ జురెల్‌, ఆకాశ్‌ దీప్‌ అంతా చాలా ఎమోషనల్‌ అయ్యారని రోహిత్‌ పేర్కొన్నాడు.

ఆకాశ్‌ దీప్‌కు టెస్ట్‌ క్యాప్‌ ఇస్తున్న సమయంలో హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అద్భుతమైన స్పీచ్‌ ఇచ్చారని, ఆయన చెప్పిన తర్వాత తమకు అనిపించింది.. ఏమన్న జర్నీనా ఇతనిది, ఎంతో కష్టపడి ఇక్కడి దాకా వచ్చాడు. గత 5, 6 ఏళ్ల క్రితం ఎక్కడుండే వాడు.. ఇప్పుడు ఎక్కడున్నాడు అని ఆలోచిస్తే చాలా ఇన్స్‌పైరింగ్‌గా అనిపించింది. ఇక టెస్ట్‌ సిరీస్‌లో చాలా మంది ఆటగాళ్లు ఎంతో అద్భుతంగా రాణించారు.. బుమ్రా బౌలింగ్‌ అయితే అద్భుతం. ఇండియాలో బుమ్రా లాంటి బౌలింగ్‌ నేను చూడలేదు. అశ్విన్‌, కుల్దీప్‌ సైతం సూపర్‌గా బౌలింగ్‌ చేసి.. కావాల్సిన టైమ్‌లో వికెట్లు అందించారు. ముఖ్యంగా కుల్దీప్‌ యాదవ్‌ అయితే.. నాకు ఎప్పుడు వికెట్‌ కావాలంటే అప్పుడొచ్చి, ఎంతో కీలకమైన వికెట్‌ అందించేవాడు. అతను బ్యాటింగ్‌లో కూడా ఆకట్టుకున్నాడని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. మరి ఆకాశ్‌ దీప్ గురించి రోహిత్‌ శర్మ చేసిన ఎమోషనల్‌ కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments