IND vs SA: వీడియో: రోహిత్ మాస్టర్ ప్లాన్.. చిచ్చర పిడుగును బుట్టలో భలే పడేశాడు!

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో యంగ్ ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ డెబ్యూట్ చేశాడు. ఇక ఈ చిచ్చర పిడుగును టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ తో బుట్టలో పడేశాడు.

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో యంగ్ ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ డెబ్యూట్ చేశాడు. ఇక ఈ చిచ్చర పిడుగును టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ తో బుట్టలో పడేశాడు.

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో ఘోర పరాభవానికి రెండో టెస్ట్ లో ప్రతీకారం తీర్చుకుంటోంది టీమిండియా. కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ టీమ్ కు గట్టి షాకిచ్చారు భారత బౌలింగ్ ద్వయం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. నిప్పులు చెరిగే తమ పేస్ బౌలింగ్ తో ప్రోటీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో కేవలం 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. మరీ ముఖ్యంగా సిరాజ్ బుల్లెట్స్ లాంటి బంతులతో సౌతాఫ్రికా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. 4 వికెట్లలో సిరాజ్ 3 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఇక ఈ మ్యాచ్ లో సఫారీ యంగ్ ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ డెబ్యూట్ చేశాడు. ఇక ఈ చిచ్చర పిడుగును టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ తో బుట్టలో పడేశాడు.

కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోతున్నారు. తొలి మ్యాచ్ లో సత్తా చాటిన సఫారీ బ్యాటర్లు ఈ మ్యాచ్ లో పూర్తిగా తేలిపోయారు. దీంతో 34 రన్స్ కే 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా పయనిస్తోంది. ఇక టీమిండియా బౌలర్లలో నయా సన్సేషన్ మహ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్ తో అదరగొడుతున్నాడు. ప్రోటీస్ బ్యాటర్లను ఏ మాత్రం క్రీజ్ లో నిలదొక్కుకోకుండా.. వచ్చిన వారిని వచ్చినట్లే పెవిలియన్ కు పంపుతున్నాడు. మరో ఎండ్ లో బుమ్రా సైతం కట్టు దిట్టంగా బౌలింగ్ వేస్తూ.. సఫారీ చిచ్చర పిడుగు ట్రిస్టన్ స్టబ్స్ ను ఔట్ చేశాడు. అయితే స్టబ్స్ ను పక్కా ప్లాన్ వేసి బుట్టలో పడేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అప్పటికే ఒత్తిడిలో ఉన్న డెబ్యూ ప్లేయర్ హిట్ మ్యాన్ ప్లాన్ కు బలైయ్యాడు. అసలేం జరిందంటే?

9వ ఓవర్ వేయడానికి బుమ్రా రాగా.. ట్రిస్టన్ స్టబ్స్ క్రీజ్ లో ఉన్నాడు. తొలి బాల్ కు రన్ రాలేదు. అయితే డెబ్యూ ప్లేయర్ ఒత్తిడిలో ఉన్న విషయాన్ని కనిపెట్టిన రోహిత్ స్లిప్ లో ముగ్గురు ఫీల్డర్లను పెట్టి.. తానే స్వయంగా షార్ట్ లెగ్ లో నిల్చున్నాడు. ఈ ఓవర్ మూడో బంతిని స్టబ్స్ డిఫెన్స్ చేయగా.. ఎడ్జ్ తీసుకుని అతడి ప్యాడ్స్ కు తాకి సరాసరి రోహిత్ శర్మ చేతిలో పడింది. దీంతో షాక్ కు గురైయ్యాడు యంగ్ బ్యాటర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కేవలం 45 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆలౌట్ కు దగ్గరగా ఉంది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో సంచలన ప్రదర్శన చేశాడు. మరి రోహిత్ మాస్టర్ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments