వీడియో: ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. ఏడ్చేసిన రోహిత్‌ శర్మ!

Rohit Sharma, IND vs ENG, T20 World Cup 2024: ఇంగ్లండ్‌పై అద్భుత విజయంతో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ, మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతో కోహ్లీ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, IND vs ENG, T20 World Cup 2024: ఇంగ్లండ్‌పై అద్భుత విజయంతో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ, మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతో కోహ్లీ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

వంద కోట్ల మందికి పైగా భారత క్రికెట్‌ అభిమానులు కోరిక నెరవేరింది.. గత టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో మనల్ని సెమీ ఫైనల్లో చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్‌.. ఇప్పుడు అదే సెమీ ఫైనల్‌లో అంతకంటే దారుణంగా ఓడించి.. రోహిత్‌ సేన సగర్వంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. రోహిత్‌ శర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో టీమిండియాను ముందుకు నడిపించగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ ఓ చేయి వేసి.. భారత్‌కు మంచి స్కోర్‌ అందించారు. ఆ తర్వాత మన స్పిన్నర్లు చెలరేగడంతో ఇంగ్లీష్‌ జట్టు తుకముడిచింది.. ఫైనల్‌ వెళ్లేందుకు టీమిండియాకు దారి ఇచ్చింది. సెమీ ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగించినా.. పూర్తి మ్యాచ్‌ జరిగి.. టీమిండియా విజేతగా నిలిచింది. ఇక శనివారం సౌతాఫ్రికాతో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది భారత జట్టు.

అయితే.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన తర్వాత.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటన భారత క్రికెట్‌ అభిమానులను సైతం భావోద్వేగానికి గురి చేసింది. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోనే టీమిండియా ఆడింది.. ఆ టోర్నీలో సెమీస్‌ వరకు వెళ్లిన భారత జట్టు సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి పాలైంది. 2023లో జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లో ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్‌ వరకు దూసుకెళ్లిన టీమిండియా.. తుది పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఇలా రెండు పెద్ద పరాజయాల తర్వాత మరోసారి తన కెప్టెన్నీలోనే టీమిండియా ఫైనల్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ ఆనందకర సమయంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎమోషనల్‌ అయ్యాడు. మ్యాచ్‌ అయ్యాక డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్తున్న సమయంలో కోహ్లీ చీయర్స్‌ చెబుతున్న సమయంలో రోహిత్‌ ఎమోషనల్‌ అయ్యాడు. ఆ సమయంలో కోహ్లీ, రోహిత్‌ను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు మంచి స్కోర్‌ చేసింది. గయానా పిచ్‌పై 171 స్కోర్‌ అంటే దాదాపు ప్రత్యర్థి ఓటమి ఒప్పెసుకున్నట్లే. అయినా కూడా టీమిండియా స్పిన్నర్లు మరింత చెలరేగడంతో విజయం ఈజీ అయిపోయింది. భారత బ్యాటర్లలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 57 పరుగులు చేశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 36 బంతుల్లో 47 పరుగులు చేసి రాణించాడు. హార్ధిక్‌ పాండ్యా 13 బంతుల్లో 23 రన్స్‌ చేసి పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్దాన్‌ 3 వికెట్లతో రాణించాడు. ఇక 172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్‌ అయిపోయింది. హ్యారీ బ్రూక్‌ 25, కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ 23, జోఫ్రా ఆర్చర్‌ 21 పరుగుల పోరాడారు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ మూడేసి వికెట్లతో అదరగొట్టారు. జస్ప్రీత్‌ బుమ్రా రెండు వికెట్లు సాధించాడు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయంతో పాటు.. రోహిత్‌ శర్మ కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments