ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా తడబడింది. లంక యువ బౌలర్ దునిత్ వెల్లలాగే బౌలింగ్ ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలగా.. జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే అర్దశతకంతో రాణించాడు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో రోహిత్ పలు రికార్డులు బ్రేక్ చేశాడు. 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 53 పరుగులు చేశాడు రోహిత్. ఇక ఈ మ్యాచ్ లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ హిట్ మ్యాన్.
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా పూర్తిగా తడబడింది. శ్రీలంక పేసర్ దునిత్ వెల్లలాగే నిప్పులు చెరిగే బౌలింగ్ ముందు వరల్డ్ క్లాస్ బౌలర్లకుగా పేరుగాంచిన విరాట్, రోహిత్, రాహుల్, పాండ్యాలు నిలువలేకపోయారు. 5 వికెట్లతో దునిత్ వెల్లలాగే సత్తాచాటాడు. టీమిండియా స్టార్ బ్యాటర్లు విఫలం అయిన చోట.. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే అర్ధశతకంతో మెరిశాడు. ఈ క్రమంలోనే అతడు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా కప్ వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా హిట్ మ్యాన్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు.
కాగా.. ఆసియా కప్ వన్డే టోర్నీలో రోహిత్ ఇప్పటి వరకు 28 సిక్సర్లు బాదగా.. ఈ రికార్డు ఇంతకు మందు పాక్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అతడు ఈ టోర్నీలో 26 సిక్సర్లు బాదాడు. తాజాగా ఈ రికార్డును బద్దలు కొట్టాడు హిట్ మ్యాన్. ఈ రికార్డుతో పాటుగా.. వన్డే క్రికెట్ లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ రికార్డు సాధించిన 6వ భారతీయుడిగా, ఓవరాల్ గా 15వ బ్యాటర్ గా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. అదీకాక అత్యంత వేగవంతంగా ఈ రికార్డును(241 ఇన్నింగ్స్ లు) సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు రోహిత్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా ప్రస్తుతం 45 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది.
10,000 ODI runs for GOAT. Rohit Sharma 🛐
He is the second fastest to achieve this milestone.
ll #INDvsSL ll #RohitSharma𓃵 ll pic.twitter.com/vHpzWdyYVa
— Nisha (@NishaRo45_) September 12, 2023