VIDEO: ఇలాంటి చెత్త ప్రశ్నలు వేయకండి! రిపోర్టర్‌పై రోహిత్‌ శర్మ ఆగ్రహం

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మీడియా సమావేశాల్లో చాలా సెటైరికల్‌గా సమాధానాలు ఇస్తుంటాడు. కొన్ని సార్లు రోహిత్‌ శర్మ ఇచ్చే సమాధానాలు నవ్వు తెప్పిస్తుంది. అలాగే కొన్ని సార్లు రిపోర్టర్లకు కౌంటర్లు కూడా వేస్తుంటాడు. అయితే.. తాజాగా వన్డే వరల్డ్‌ కప్‌ 2023 కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించే సమయంలో రోహిత్‌ కాసింత అసహనానికి గురయ్యాడు. మీడియా ప్రతినిధులకు గట్టి వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. ఇలాంటి ప్రశ్నలు వరల్డ్‌ కప్‌ సమయంలో తనను అడగొద్దని అన్నాడు. ఇంతకీ రోహిత్‌కు కోపం తెప్పించిన ఆ చెత్త ప్రశ్నలేంటో ఇప్పుడు చూద్దాం..

భారత్‌ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ 2023 కోసం మంగళవారం చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ 15మందితో కూడాన ఇండియన్‌ స్క్వౌడ్‌ను ప్రకటించాడు. ఈ సమావేశంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం పాల్గొన్నాడు. అయితే.. టీమ్‌ ప్రకటన తర్వాత.. మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు రోహిత్‌ శర్మకు సంధించారు. వాటిలో చాలా వరకు బయట అనుకుంటున్నారు, పుకార్లు నడుస్తున్నాయ్‌ అనే కోణంలోనే జర్నలిస్టులు ఎక్కువగా ప్రశ్నలు అడిగారు. వీటికి సమాధానం చెప్పేందుకు రోహిత్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

బయట ఏదో అనుకుంటున్నారు, అలా అంటున్నారు అంటూ అర్థం లేని వాటి గురించి తనను అడగొద్దని, ఇప్పుడు తమ ఫోకస్‌ మొత్తం ఒక విషయంపైనే ఉంచినట్లు చెప్పాడు. ఎవరో ఏదో అనుకుంటున్నారంటూ ఊహాగానాలకు తాను సమాధనం చెప్పనని, వరల్డ్‌ కప్‌ సమయంలో కూడా ఇలాంటి ఊహాగానాలపై తనను ప్రశ్నలు అడగొద్దని రోహిత్‌ స్పష్టం చేశాడు. ముఖ్యంగా టీమ్‌లో చాహల్‌, అశ్విన్‌లను తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయనే విషయంపై రోహిత్‌ ఈ విధంగా స్పందించారు. జట్టులో ఓ ఆఫ్‌ స్పిన్నర్‌ ఉండాల్సిన అవసరం ఉందని బయట అనుకుంటున్నారనే ప్రశ్న రోహిత్‌కు కోపం తెప్పించింది. మరి ఈ విషయంలో రోహిత్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. కన్నీళ్లు పెట్టుకున్న రషీద్‌ ఖాన్‌!

Show comments