టీ20 వరల్డ్‌ కప్‌ జెర్సీలో మెరిసిన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ! ఫొటోలు చూశారా? అదిరిపోయాయి..

Rohit Sharma, Virat Kohli, T20 World Cup 2024 Jersey: మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం అడిడాస్‌ కొత్త జెర్సీని లాంచ్‌ చేసింది. మరి ఆ జెర్సీలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఎలా ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Virat Kohli, T20 World Cup 2024 Jersey: మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం అడిడాస్‌ కొత్త జెర్సీని లాంచ్‌ చేసింది. మరి ఆ జెర్సీలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఎలా ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ సందడి మొదలైపోయింది. జూన్‌ 2 నుంచి వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికగా జరిగే ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే పలు దేశాలు తమ జట్లను కూడా ప్రకటించాయి. భారత సెలెక్టర్లు సైతం 15 మందితో కూడిన స్క్వౌడ్‌ను ప్రకటించారు. మరో నలుగురు ఆటగాళ్లను స్టాండ్‌బై ప్లేయర్లుగా ఎంపిక చేశారు. ఈ జట్టుకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌ కోసం టీమిండియా జెర్సీ స్పాన్సర్‌ అయిన అడిడాస్‌ కొత్త జెర్సీని లాంచ్‌ చేసింది. సోమవారం ఈ జెర్సీ లాంచ్‌ కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌లు పాల్గొన్నారు.

అయితే.. ఈ జెర్సీలను ధరించి టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా, స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌లు ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. కొత్త జెర్సీలో రోహిత్‌, కోహ్లీ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. తమ అభిమాన ఆటగాళ్లను కొత్త జెర్సీలో చూసిన క్రికెట్‌ అభిమానులు ఫుల్‌ హ్యాపీ అవుతున్నారు. బ్లూ అండ్‌ ఆరెంజ్‌ కాంబినేషన్‌లో టీ20 వరల్డ్‌ కప్‌ జెర్సీ అదిరిపోయిందని ఫ్యాన్స్‌ అంటున్నారు. జెర్సీ కాలర్‌కు జాతీయ జెండాలో ఉండే మూడు రంగులు వాడారు. ఈ జెర్సీలో రోహిత్‌ శర్మ, కోహ్లీ మెరిసిపోతున్నారంటూ క్రికెట్‌ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

కాగా, జెర్సీపై ఇంకా టీ20 లోగోను ముద్రించలేదు. ఐపీఎల్‌ తర్వాత కాస్త గ్యాప్‌తో టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. మే 26తో ఐపీఎల్‌ ముగియనుంది. అలాగే జూన్‌ 2 నుంచి టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ ప్రారంభం కానుంది. జూన్‌ 5 టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఢీకొట్టనుంది. జూన్‌ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడునుంది టీమిండియా. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే అమెరికా న్యూయార్క్‌లో ఓ కొత్త స్టేడియాన్నే నిర్మిస్తోంది. రెడీమేడ్‌ పిచ్‌ కూడా ఈ స్టేడియంలో ఇన్‌స్టాల్‌ చేశారు. మరి టీ20 వరల్డ్‌ కప్‌ జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు ఎలా ఉన్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments