iDreamPost
android-app
ios-app

IND vs SA: రోహిత్-కోహ్లీ మధ్య అద్భుత దృశ్యం! ఇలా చూసి చాలా కాలమైంది!

  • Published Jan 03, 2024 | 4:15 PM Updated Updated Jan 03, 2024 | 4:30 PM

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో రోహిత్-కోహ్లీ మధ్య అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో రోహిత్-కోహ్లీ మధ్య అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Published Jan 03, 2024 | 4:15 PMUpdated Jan 03, 2024 | 4:30 PM
IND vs SA: రోహిత్-కోహ్లీ మధ్య అద్భుత దృశ్యం! ఇలా చూసి చాలా కాలమైంది!

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. టీమిండియా సీనియర్ ప్లేయర్లుగా జట్టును ముందుండి నడిపిస్తున్నారు ఈ ద్వయం. వీరిద్దరు తమ అద్భుత ప్రదర్శనతో జట్టుకు తిరుగులేని విజయాలను అందిస్తున్నారు. అయితే కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన వీరిద్దరి మధ్య దూరం పెంచిందని, అందుకే అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని చాలా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా కూడా స్పందించాడు రన్ మెషిన్ కింగ్ కోహ్లీ. రోహిత్ శర్మతో నాకు ఎలాంటి విభేదాలు లేవని, మేమిద్దరం మంచి స్నేహితులమని వివరణ ఇచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో రోహిత్-కోహ్లీ మధ్య అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తొలిటెస్ట్ లో దారుణ ఓటమికి రెండో టెస్ట్ లో ప్రతీకారం తీర్చుకుంటోంది టీమిండియా. అందులో భాగంగా కేప్ టౌన్ వేదికగా ప్రారంభమైన రెండో పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది సఫారీ టీమ్. తొలి టెస్ట్ లో లాగా.. బ్యాటర్లు విజృంభిస్తారని అనుకున్నారు కాబోలు. కానీ అనూహ్యంగా టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ చెలరేగడంతో.. కేవలం 23.2 ఓవర్లకే 55 పరుగులకు కుప్పకూలింది ప్రోటీస్ జట్టు. పేస్ గన్ మహ్మద్ సిరాజ్ సంచలన బౌలింగ్ తో చెలరేగి 6 వికెట్లను నేలకూల్చాడు. సిరాజ్ ధాటికి సఫారీ బౌలర్లు ఇలా వచ్చి.. అలా వెళ్లారు. కేవలం ఇద్దరు మాత్రమే రెండెక్కల స్కోర్ చేశారంటే భారత బౌలర్లు ఏ రేంజ్ లో ప్రత్యర్థికి చుక్కలు చూపారో అర్దం చేసుకోవచ్చు.

కాగా.. ప్రోటీస్ జట్టులో డేవిడ్ బెడింగ్ హామ్ 12, కైల్ వెరెన్నే 15 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక ఈ మ్యాచ్ లో సిరాజ్ సూపర్ సక్సెస్ కావడంతో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆనందంలో మునిగిపోయారు. సిరాజ్ వికెట్ తీసినప్పుడు తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఒకరిని ఒకరు ప్రేమగా కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఇటు రోహిత్ ఫ్యాన్స్, అటు విరాట్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇంత సంతోషంగా వీరిద్దరిని చూసి చాలా కాలమైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్క పిక్ తో తమ ఇద్దరి స్నేహంపై వచ్చిన పుకార్లకు చెక్ పెట్టారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, స్నేహం మాత్రమే ఉందని మరోసారి నిరూపించారు రోహిత్-కోహ్లీ. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Middle stump Cricket (@middle.stump.cric)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş