iDreamPost
android-app
ios-app

సెమీస్ కి ముందు రోహిత్ – కోహ్లీ ఫ్యాన్స్ మధ్య గొడవ! కారణం?

  • Published Nov 15, 2023 | 11:48 AM Updated Updated Nov 15, 2023 | 11:49 AM

క్రికెట్‌ అభిమానులంతా వరల్డ్‌ కప్‌లో సెమీ ఫైనల్‌లో టీమిండియా గెలుస్తుందా? లేదా అని టెన్షన్‌ పడుతుంటే.. మరో వైపు కొంతమంది మాత్రం క్రికెటర్లు పేరుతో గొడవకు దిగుతున్నారు. ఇలాంటి టైమ్‌లో ఈ గొడవలు ఏంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అసలు గొడవ ఏంటో? ఎందుకు జరుగుతుందో? ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్‌ అభిమానులంతా వరల్డ్‌ కప్‌లో సెమీ ఫైనల్‌లో టీమిండియా గెలుస్తుందా? లేదా అని టెన్షన్‌ పడుతుంటే.. మరో వైపు కొంతమంది మాత్రం క్రికెటర్లు పేరుతో గొడవకు దిగుతున్నారు. ఇలాంటి టైమ్‌లో ఈ గొడవలు ఏంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అసలు గొడవ ఏంటో? ఎందుకు జరుగుతుందో? ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Nov 15, 2023 | 11:48 AMUpdated Nov 15, 2023 | 11:49 AM
సెమీస్ కి ముందు రోహిత్ – కోహ్లీ ఫ్యాన్స్ మధ్య గొడవ! కారణం?

యావత్‌ క్రికెట్‌ లోకం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో ఈ బిగ్‌ ఫైట్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే రెండు జట్లు గట్టిగా ప్రిపేర్‌ అయి బరిలోకి దూకెందుకు రెడీగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియానే హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నా.. న్యూజిలాండ్‌తో నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఇండియాకు ఉన్న బ్యాడ్‌ రికార్డు కాస్త కలవరపెడుతోంది. 2019 వన్డే వరల్డ్‌ కప్‌లోనూ న్యూజిలాండ్‌తోనే సెమీ ఫైనల్‌ ఆడిన టీమిండియా.. ఓటమి పాలైన విషయం తెలిసిందే. కానీ, ఈసారి అలా ఏం జరగదని, భారత జట్టు ఎంతో పటిష్టంగా ఉందని చాలా మంది ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉండగా..

ప్రస్తుతం దేశం మొత్తం న్యూజిలాండ్‌తో టీమిండియా ఎలా ఆడుతుందో? గెలుస్తుందా? లేదా? అని ఆలోచిస్తుంటే.. మరో పక్క జట్టులోని స్టార్‌ ఆటగాళ్ల ఫ్యాన్స్‌ మాత్రం సోషల్‌ మీడియాలో కొట్టుకొచస్తున్నారు. టీమిండియాకు రెండు కళ్లలాంటి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఫ్యాన్స్‌ మధ్య సెమీస్‌కి ముందు గొడవ మొదలైంది. అయితే.. ఈ చిచ్చుపెట్టింది మాత్రం స్టార్‌ స్పోర్ట్స్‌. ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌కి ముందు ఓ పోస్టర్‌ను రూపొందించిన స్టార్‌ స్పోర్ట్స్‌ అందులో కేన్‌ విలియమ్సన్‌తో పాటు పక్కన విరాట్‌ కోహ్లీని ఉంచింది. విలియమ్సన్‌ కివీస్‌ కెప్టెన్‌ కావడంతో అతను తన టీమ్‌ను రిప్రజెంట్‌ చేస్తున్నాడు. మరి టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ కాదు కదా.. అతన్ని ఎందుకు పెట్టారంటూ రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ కదా ఆ పోస్టర్‌లో ఉండాల్సింది. కోహ్లీని కావాలనే స్టార్‌ స్పోర్ట్స్‌ హైప్‌ చేస్తోంది. కష్టం ఒకరిదైతే.. గుర్తింపు మరొకరికి ఇస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. మరోవైపు రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌కు విరాట్‌ కోహ్లీ ఫ్యాన్స్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. విరాట్‌ కోహ్లీ జట్టులో స్టార్‌ ప్లేయర్‌ అని, ఫేస్‌ ఆఫ్‌ ది వరల్డ​్‌ క్రికెట్‌గా ఉన్న కోహ్లీని పోస్టర్‌లో చూసి కుళ్లుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. దీంతో ఇద్దరి ఫ్యాన్స్‌ మా వాడు గొప్ప అంటే మా వాడు గొప్ప అంటూ సోషల్‌ మీడియాలో అర్థంలేని వాదనలకు దిగుతున్నారు. కాగా, కోహ్లీ ప్లేస్‌లో మళ్లీ రోహిత్‌ శర్మ ఫొటోను పెట్టింది స్టార్‌ స్పోర్ట్స్‌ మరి. ఇప్పటికైనా ఈ ఫ్యాన్‌ వార్‌ ఆపేసి.. కలిసి కట్టుగా టీమిండియాకు సపోర్ట్‌ చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetfixbetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş